Caves On Moon : చందమామపై గుహ.. ఎంచక్కా అందులో ఉండిపోవచ్చు!
చందమామను(Moon) మనిషి అందుకున్నాడు. జాబిల్లిని గెలిచాడు
చందమామను(Moon) మనిషి అందుకున్నాడు. జాబిల్లిని గెలిచాడు. ఇప్పుడు చంద్రుడిపై మానవసహిత యాత్రలు చేపట్టాలనే ఆలోచన చేస్తున్నాడు. కొందరైతే అక్కడ ప్లాటింగులు కూడా చేశారు. కొనేవాళ్లు కొన్నారు కూడా! ఆ విషయం అలా ఉంచితే అక్కడికి వెళ్లేవాళ్లకు ఓ గుడ్ న్యూస్. చంద్రుడిపై ఓ గుహ(cave) ఉన్నదని ఇటలీ శాస్త్రవేత్తల(Italy scientist) బృందం నిర్ధారించింది. ఇలాంటివి అక్కడ వందల సంఖ్యలో ఉండవచ్చని భావిస్తోంది. భవిష్యత్తులో చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాములకు ఇది షెల్టర్‌గా వాడొచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. తాము గుర్తించిన గుహ పెద్దగానే ఉందని, చంద్రుడిపై అత్యంత లోతైన బిలం నుంచి ఇందులోకి ప్రవేశమార్గం ఉందని చెబుతున్నారు. 1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఆల్డ్రిన్‌లు దిగిన సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ప్రదేశానికి 400 కిలోమీటర్ల దూరంలో ఈ గుహ ఉందని, ఒక లావా సొరంగం కుప్పకూలడం వల్ల అది ఏర్పడిందని అంటున్నారు.
భవిష్యత్తులో అక్కడికి వెళ్లే వందలాది మంది వ్యోమగాములు అందులో ఆశ్రయం(shelter) పొందవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లావా ట్యూబ్స్‌తో 200కుపైగా గొయ్యి మాదిరి ఉండే గుహలు ఏర్పడ్డాయని గుర్తించారు.