Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ..!
న్యూయార్క్ టైమ్స్(New York Times), ముగ్గురు రిపోర్టర్లకు దాదాపు 4 లక్షల డాలర్లు చెల్లించాల్సి ఉందని న్యూయార్క్ న్యాయమూర్తి రీడ్ తీర్పు చెప్పారు. ట్రంప్(Donald Trump) ఆస్తులు, పన్ను ఎగవేతపై ప్రచురించిన కథనానికి వ్యతిరేకంగా ట్రంప్ వేసిన పిటిషన్‌పై తీర్పు ఇచ్చింది. ట్రంప్ మేనకోడలు మేరీ ట్రంప్(Merry Trump) ఇచ్చిన ఆధారంగా ఈ కథనాన్ని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది.

న్యూయార్క్ టైమ్స్ పత్రిక, ముగ్గురు రిపోర్టర్లు సుసాన్ క్రెయిగ్, డేవిడ్ బార్‌స్టో, రస్సెల్ బ్యూట్‌నర్‌కు 3,92,638 డాల్లర్ల లీగల్ ఫీజులను చెల్లించాల్సిందేనని న్యాయమూర్తి రీడ్ ఆదేశించారు. రహస్యంగా ఉంచాల్సిన ఆస్తుల వివరాలను మేరీట్రంప్, న్యూయార్క్ టైమ్స్, ముగ్గురు లాయర్లు ఉల్లంఘించారని 2021లో ట్రంప్ వేసిన పిటిషన్‌ను తిరస్కరించారు. జర్నలిస్టుల నోరు మూయించేందుకు ఇలాంటి పనికిమాలిన వ్యాజ్యాల నుంచి రక్షించే రాష్ట్ర SLAPP వ్యతిరేక (ప్రజా భాగస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యూహాత్మక దావా) చట్టాన్ని కూడా ఆయన ప్రశంసించారు. దీనిపై న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధి మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా సవరించబడిన SLAPP వ్యతిరేక చట్టం పత్రికా స్వేచ్ఛను రక్షించేందుకేనన్నారు.
కోర్టులో ట్రంప్ తరపున లాయర్లు వాదించారు. ట్రంప్ ఆస్తుల వివరాలను అందించాలని మేరీ ట్రంప్‌పై ముగ్గురు రిపోర్టర్లు ఒత్తిడి తెచ్చారని.. ట్రంప్ తండ్రి ఫ్రెడ్ ట్రంప్ ఆస్తికి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేయకూడదని మేరీ ట్రంప్ సహా విలేకరులకు కూడా తెలుసన్నారు. నాకు మోసం చేశారని జడ్జి తీర్పు ఇచ్చిన తర్వాత ట్రంప్ కోర్టులో అరిచారు.