ఒకప్పుడు అతడు ప్రపంచంలోనే అత్యధిక బరువున్న వ్యక్తి. 610 కిలోలు ఉండేవాడు. అధిక బరువుతో నానా ఇబ్బంది పడేవాడు.

ఒకప్పుడు అతడు ప్రపంచంలోనే అత్యధిక బరువున్న వ్యక్తి. 610 కిలోలు ఉండేవాడు. అధిక బరువుతో నానా ఇబ్బంది పడేవాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు 60 కిలోల బరువున్నాడంతే! 542 కిలోలో బరువు తగ్గడమంటే మాటలు కాదుగా! ఇంతకీ బరువు ఎలా తగ్గాడంటే ఓ రాజు ఇచ్చిన సహకారంతోనే! సౌదీ అరేబియా(Saudi Arabia)కు చెందిన ఖలీద్‌ బిన్‌ మొహసేన్‌ షారీ(Khalid Bin Mohsen Shaari)అనే వ్యక్తి భారీ కాయంతో కష్టాలు పడేవాడు. 2013లో 610 కిలోల బరువు పెరిగాడు. మూడేళ్ల పాటు ఎటూ కదల్లేక మంచానికే పరిమితమయ్యాడు. చివరకు తన పనులు కూడా చేసుకోలేని దుస్థితికి వచ్చాడు. ఖలీద్‌ దీనగాధ విన్న అప్పటి సౌదీ రాజు అబ్దుల్లా(Abdullah)అతడి ప్రాణాలు కాపాడాలనుకున్నారు. తన సొంత డబ్బుతో ఖలీద్‌కు వైద్యం అందించడం మొదలు పెట్టాడు. ప్రత్యేకంగా ఒక బెడ్‌ను డిజైన్‌ చేయించాడు. అతడిని రియాద్‌లోని కింగ్‌ ఫాహద్‌ మెడికల్‌ సిటీకి తరలించారు. 30 మంది వైద్యులు ఎప్పటికప్పుడు అతడికి చికిత్స అందించారు. ఒక డైట్ ఛార్ట్‌ను సిద్ధం చేశారు. గ్యాస్ట్రిక్ బైపాప్ సర్జరీ చేశారు. శరీరంలో కదలికలను పునరుద్ధరించేందుకు వ్యాయామాలు చేయించారు. ఫిజియోథెరపీ నిర్వహించారు. దాంతో ఆరు నెలల్లో ఖలీద్‌ సగానికి సగం బరువు తగ్గాడు. ఇక 2023లో 542 కేజీలు తగ్గాడు. దాంతో 600 కేజీలున్న వ్యక్తి కాస్తా 60 కేజీల ఆరోగ్యవంతుడిగా మారిపోయాడు. దాంతో అదనపు చర్మం తొలగింపు కోసం శస్త్ర చికిత్సలు అవసరమయ్యాయి. ఇప్పుడు ఖలీద్‌ సరికొత్త రూపును సంతరించుకున్నాడు. ఇప్పుడతడిని అందరూ స్మైలింగ్ మ్యాన్‌ అని అంటున్నారు. అతడికి ఆ పేరు పెట్టింది వైద్య సిబ్బందే!

ehatv

ehatv

Next Story