మిస్ యూనివర్స్ అందాల పోటీ ఈసారి చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. చరిత్రలో తొలిసారిగా ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా జెండా కూడా పోటీ వేదికపై కనిపించనుంది.

మిస్ యూనివర్స్ అందాల పోటీ ఈసారి చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. చరిత్రలో తొలిసారిగా ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా జెండా కూడా పోటీ వేదికపై కనిపించనుంది. మోడల్ రూమి అల్ఖహ్తానీ తొలిసారిగా పోటీలో సౌదీ అరేబియా దేశం తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. 27 ఏళ్ల రూమీ ఇప్పటికే అనేక అందాల పోటీల్లో పాల్గొంది. రూమీ అల్కహ్తానీ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ సమాచారాన్ని పంచుకున్నారు.

రూమీ అల్కహ్తానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఒక మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. సోమవారం రూమీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్‌ను పంచుకుంది. మిస్ యూనివర్స్ పోటీలో దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న‌ట్లు తెలియజేసింది.

అందాల పోటీల్లో సౌదీ అరేబియా పాల్గొనడం పెద్ద ముందడుగు. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ నాయకత్వంలో సంప్రదాయవాద భావజాలం క్రమంగా క్షీణిస్తున్నట్లు కూడా ఒక సూచన ఉంది.

రూమీ అల్కహతా మాట్లాడుతూ.. 'మిస్ యూనివర్స్ 2024 పోటీలో పాల్గొనడం నాకు గౌరవంగా ఉందని వెల్ల‌డించింది. రూమి తన అందమైన చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఆమె సౌదీ అరేబియా జెండాను పట్టుకుని కనిపించింది. ఎన్నో గ్లోబల్ పోటీల్లో పాల్గొన్న రూమీ కొద్ది రోజుల క్రితం మలేషియాలో జరిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏషియన్ లో పాల్గొంది.

రియాద్‌లో జన్మించిన రూమీ అల్ఖహ్తానీ మిస్ సౌదీ అరేబియా. ఇది కాకుండా ఆమె మిస్ అరబ్ వరల్డ్ పీస్ 2021 మరియు మిస్ ఉమెన్ (సౌదీ అరేబియా) టైటిళ్లను కూడా గెలుచుకుంది. ఈ ఏడాది మెక్సికోలో అందాల పోటీలు నిర్వహించనున్నారు. నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్ ప్రస్తుతం మిస్ యూనివర్స్ గా ఉంది.

Updated On 26 March 2024 8:52 AM GMT
Yagnik

Yagnik

Next Story