Sarah Wilkinson : 20 ఏళ్లు సరైన వరుడి కోసం వెతికింది.. దొరక్కపోతే ఏం చేసిందంటే...!
బ్రిటన్‌కు(Britain) చెందిన 42 ఏళ్ల సారా విల్కిన్‌సన్‌కు( Sara Wilkinson ) గట్టి చిక్కే వచ్చిపడింది. పాపం ఆమె సరైన జోడి కోసం 20 ఏళ్లుగా వెదుకుతూనే ఉన్నారు కానీ సరైన భాగస్వామి దొరకడం లేదు. వెతికి వెతికి అలసిపోయిన ఆమె ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లండ్‌లోని ఫెలిక్స్‌స్టోలో ఉంటున్న ఆమె హార్వెస్ట్ హౌస్‌లో తనను తానే పెళ్లి చేసుకున్నారు.
బ్రిటన్‌కు(Britain) చెందిన 42 ఏళ్ల సారా విల్కిన్‌సన్‌కు( Sara Wilkinson ) గట్టి చిక్కే వచ్చిపడింది. పాపం ఆమె సరైన జోడి కోసం 20 ఏళ్లుగా వెదుకుతూనే ఉన్నారు కానీ సరైన భాగస్వామి దొరకడం లేదు. వెతికి వెతికి అలసిపోయిన ఆమె ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లండ్‌లోని ఫెలిక్స్‌స్టోలో ఉంటున్న ఆమె హార్వెస్ట్ హౌస్‌లో తనను తానే పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుక కోసం సారా విల్కిన్‌సన్ లక్షల రూపాయలు ఖర్చు చేశారు. చిన్నప్పట్నుంచి పెళ్లిలో డైమండ్ రింగ్ ధరించాలని కలలు కనేవారట! ఇన్నాళ్లకు తన కలను నెరవేర్చుకున్నానని తెగ సంబరపడిపోతున్నారు సారా! కాకపోతే ఈ పెళ్లికి అధికారిక గుర్తింపు లభించలేదు. కానీ పెళ్లి మాత్రం చాలా గ్రాండ్‌గా జరిగింది. పెళ్లి మండపానికే బోల్డంత ఖర్చు పెట్టారు. డేకరేషన్ , ఫుడ్డు, డ్రింక్స్ వరకు అన్ని ఏర్పాట్లు గ్రాండ్‌గానే చేశారు సారా. తన పెళ్లి ఖర్చుల కోసం ఎన్నో ఏళ్లుగా పొదుపు చేస్తూ వచ్చిన డబ్బునంతా వెచ్చించారు. ఈ పెళ్లికి సారా విల్కిన్సన్(Sara Wilkinson ) సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సారా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని తాము అనుకోలేదని కుటుంబసభ్యులు అంటున్నారు. సారా స్నేహితురాలు,ప్రొఫెషనల్ వెడ్డింగ్ ప్లానర్ కేథరీన్ క్రెస్‌వెల్ ఈ వేడుకను నిర్వహించారు. సారా వివాహ వేడుకలో తామంతా కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు కేథరీన్. కాగా సారా తనను తాను వివాహం చేసుకున్నప్పటికీ, తనకు సరైన జోడీ దొరికే వరకూ వెదుకుతూనే ఉంటానని చెప్పారు. శీగ్రమేవ నిజ కళ్యాణ ప్రాప్తిరస్తు....!