కరోనా(Corona) విజృంభిస్తున్న కాలంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్‌ హోమ్‌(Work from home) సౌకర్యాన్ని కల్పించాయి. కరోనా నెమ్మదించిన తర్వాత కొంతకాలం హైబ్రిడ్‌(Hybrid) విధానంలో ఉద్యోగులు పని చేసే వీలు కల్పించాయి. ఇప్పుడు ఇంట్లోంచి పని చేయడం కుదరదని, ఆఫీసుకు రావాల్సిందేనని ఉద్యోగులపై(Employee) ప్రెజర్‌ తెస్తున్నాయి.

కరోనా(Corona) విజృంభిస్తున్న కాలంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్‌ హోమ్‌(Work from home) సౌకర్యాన్ని కల్పించాయి. కరోనా నెమ్మదించిన తర్వాత కొంతకాలం హైబ్రిడ్‌(Hybrid) విధానంలో ఉద్యోగులు పని చేసే వీలు కల్పించాయి. ఇప్పుడు ఇంట్లోంచి పని చేయడం కుదరదని, ఆఫీసుకు రావాల్సిందేనని ఉద్యోగులపై(Employee) ప్రెజర్‌ తెస్తున్నాయి. ఇంతకాలం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు అలవాటుపడ్డ ప్రాణాలాయె! ఆఫీసుకు రమ్మని చెబితే ఉద్యోగులకు కోపం వచ్చేయదూ! చాలా కంపెనీలలో ఇదే జరుగుతోంది. తాము ఆఫీసుకు రాబోమంటూ ఉద్యోగులు ఎదురుతిరుగుతున్నారు. జర్మన్‌లో(German) ఉన్న దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ శాప్‌ (SAP) ఈమధ్యనే రిమోట్‌ వర్క్‌ ఫ్లెక్సిబిలిటీని తీసేసింది. దీంతో మేనేజ్‌మెంట్‌పై ఉద్యోగులు ఎదురుతిరిగారు. తమల్ని ఆఫీసుకు రావాల్సిందేనని బలవంతపెడితే మాత్రం ఉద్యోగాలకు రాజీనామా చేస్తామంటూ ఓ అయిదువేల మంది ఉద్యోగులు మేనేజ్‌మెంట్‌ను బెదిరిస్తున్నారు.

ఏప్రిల్‌ నుంచి అందరూ తప్పనిసరిగా ఆఫీసులకు రావాల్సిందేనని ఆన్‌-సైట్‌ వర్క్‌ గైడెన్స్‌ జారీ చేయడం ఉద్యోగులకు కోపం తెప్పిస్తోంది. ఇంతకాలం ఉద్యోగులకు లొకేషన్ ఫ్లెక్సిబులిటీ ఇచ్చి ఇప్పుడు సడన్‌గా రూల్స్‌ మార్చడం సరికాదని శాప్‌ యూరోపియన్‌ వర్క్స్‌ కౌన్సిల్ తెలిపింది. అయితే కంపెనీ సీఈవో క్రిస్టియన్‌ క్లైన్‌ మాత్రం ఉత్పాదకత పెరగాలంటే క్యాంపస్‌ కో లొకేషన్‌ చాలా అవసరని చెబుతున్నారు. దాని వల్ల ఉద్యోగులు సాంస్కృతికంగా దగ్గరవుతారని అంటుననారు. రిమోట్, ఆన్-సైట్ అంచనాలను బ్యాలెన్స్ చేయడానికి హైబ్రిడ్ విధానంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని శాప్‌ తెలిపంది. కోవిడ్‌ కాలంలో ఉద్యోగులకు అనువైన పని అవకాశాన్ని కల్పించిన మొదటి టెక్‌ కంపెనీలలో శాప్‌ కూడా ఒకటి. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా టెక్‌ కంపెనీలు ఆన్‌-సైట్‌ వర్క్‌ విధానంపై దృష్టి పెట్టాయి. ప్రోత్సాహకాలు, ప్రమోషన్‌లు, ఇతర ప్రయోజనాలను వర్తింపజేయడానికి ఆఫీసుకి హాజరును నిర్ణయాత్మకంగా చూస్తున్నాయి. ప్రముఖ టెక్‌ దిగ్గజం టీసీఎస్‌ కూడా జీతాలు, ప్రమోషన్‌లతో పాటు ఇతర సౌకర్యాలు రిటర్న్‌ టు ఆఫీస్‌ పాలసీపై ఆధారపడి ఉంటాయని తెలిపింది.

Updated On 5 Feb 2024 5:27 AM GMT
Ehatv

Ehatv

Next Story