San Fermin Festival : మన జల్లికట్టులాంటిదే శాన్‌ఫెర్మిన్ ఫెస్టివల్.... ఎక్కడ జరుగుతుందంటే...!
మన జల్లికట్టులాంటి(Jallikattu) క్రీడే స్పెయిన్‌లోనూ(Spain) జరుగుతుంది. ఆ వేడుక పేరు బుల్‌రన్ ఫెస్టివల్(Bullrun Festival). ఈ సీజన్‌లోనే ఆ వేడుక జరుగుతుంది. ఈ వారమంతా అక్కడివారు బుల్‌రన్‌తో బిజీగా ఉన్నారు. దీన్ని వారు శాన్‌ఫెర్మిన్ ఫెస్టివల్(San Fermin Festival)గా పిలుచుకుంటారు. వీధుల్లో ఎద్దులను(OX) అలా పరుగులు పెట్టిస్తుంటారు. వాటిని పట్టుకునేందుకు యువకులు ప్రయత్నిస్తుంటారు..

San Fermin Festival
మన జల్లికట్టులాంటి(Jallikattu) క్రీడే స్పెయిన్‌లోనూ(Spain) జరుగుతుంది. ఆ వేడుక పేరు బుల్‌రన్ ఫెస్టివల్(Bullrun Festival). ఈ సీజన్‌లోనే ఆ వేడుక జరుగుతుంది. ఈ వారమంతా అక్కడివారు బుల్‌రన్‌తో బిజీగా ఉన్నారు. దీన్ని వారు శాన్‌ఫెర్మిన్ ఫెస్టివల్(San Fermin Festival)గా పిలుచుకుంటారు. వీధుల్లో ఎద్దులను(bulls) అలా పరుగులు పెట్టిస్తుంటారు. వాటిని పట్టుకునేందుకు యువకులు ప్రయత్నిస్తుంటారు.. ప్రతి ఏడాది జులైలో తొమ్మిది రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరుగుతుంటుంది.. జులై ఆరున ఈ వేడుక మొదలయ్యింది. 14వ తేదీ వరకు కొనసాగుతుంది..ఈ తొమ్మిది రోజులూ అక్కడ జనాన్ని చూడాలి.. ఊగిపోతారు. ఉర్రూతలూగిపోతారు..
వీధులన్ని ఎరుపురంగును సంతరించుకుంటాయి. పండుగ వాతావరణం వచ్చేస్తుంది. ఎద్దులైతే ఎద్దులు, దున్నలైతే దున్నలు.. అలా వాటి వెంట పడుతూ వాటిని పట్టుకునేందుకు పరుగులు పెడుతూ ప్రజలు తెగ ఉత్సాహపడిపోతారు. ప్రతి రోజు ఉదయం ఎనిమిది గంటలకు బుల్‌రన్ మొదలవుతుంది. దాదాపు కిలోమీటర్ దూరం ఎద్దుల వెంట జనం పరుగెడతారు. పాంప్లోనా నగరంలో ఈ పరుగు ప్రారంభమవుతుంది.. ప్రత్యేకంగా తయారు చేసిన బాణాసంచా కాల్చి బుల్‌రన్‌ను ప్రారంభిస్తారు.. అచ్చంగా జల్లికట్టును తలపించేట్టుగా ఉండే ఈ క్రీడను నిషేధించాలంటూ అక్కడ కూడా జంతు సంరక్షణ కార్యకర్తలు ఎప్పట్నుంచో ఆందోళన చేస్తున్నారు. ప్రతి ఏడాది ఎవరో ఒకరు చనిపోతూనే ఉంటున్నారు. అయినా బుల్ రన్ మాత్రం పరుగులు పెడుతూనే ఉంది.
