☰
✕
Putin In North Korea: ఉత్తర కొరియాలో పుతిన్.. ప్రపంచానికి ప్రమాదమా!!
By Eha TvPublished on 18 Jun 2024 3:00 AM GMT
x
ఉత్తర కొరియాలో ఇతర దేశాల ప్రజలు అడుగు పెట్టడం చాలా అరుదు. ఇప్పుడు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ నార్త్ కొరియాలో అడుగుపెట్టనున్నారనే వార్త ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 24 ఏళ్లలో తొలిసారిగా అక్కడికి వెళ్లనున్నారు. పుతిన్ మంగళ, బుధవారాల్లో ఉత్తర కొరియాను సందర్శిస్తారని.. ఉక్రెయిన్ దాడి తర్వాత అణ్వాయుధ దేశంతో రష్యా భాగస్వామ్యానికి కట్టుబడి ఉంటామని రెండు దేశాలు తెలిపాయి. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గత సెప్టెంబర్‌లో రష్యా ఫార్ ఈస్ట్ పర్యటన సందర్భంగా పుతిన్‌కు ఆహ్వానం పంపారు. పుతిన్ చివరిసారిగా జూలై 2000లో ప్యోంగ్యాంగ్‌ను సందర్శించారు.
రష్యా, ఉత్తర కొరియాల మధ్య లోతైన సంబంధాల వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అమెరికా అభిప్రాయపడింది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి మద్దతుగా పుతిన్ ఆయుధాలను కోరే అవకాశం ఉందని అమెరికా తెలిపింది. ఈ పర్యటనలో రష్యా, ఉత్తర కొరియా భద్రతాపరమైన అంశాలతో కూడిన భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేయవచ్చని పుతిన్ విదేశాంగ విధాన సలహాదారు యూరి ఉషకోవ్ తెలిపారు. రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఉప ప్రధాన మంత్రి అలెగ్జాండర్ నోవాక్, ప్రతినిధి బృందంలో భాగంగా ఉండనున్నారు.
Eha Tv
Next Story