☰
✕
Pornography: పోర్న్‌కు ఆల్టర్నేట్ అవసరం...రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
By ehatvPublished on 20 Dec 2024 5:08 AM GMT
పోర్నోగ్రఫీ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.
x
పోర్నోగ్రఫీ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. యూత్ కు అదో వ్యసనంగా మారింది. ఈ సమస్య పరిష్కారం కోసం చాలా మంది చాన్నాళ్లుగా వెతుకుతున్నారు. దీనికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక పరిష్కారాన్ని సూచించారు. పోర్న్ కంటెంట్‌కు ప్రత్యామ్నాయంగా జనాలను ఆకర్షించే మరింత ఆసక్తికరమైన, ఉత్సాహవంతమైన కంటెంట్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పుతిన్ చెప్పారు. అడల్డ్ కంటెంట్‌కు రష్యాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్నదని, ఇది వరల్డ్ వైడ్ సమస్య అని పుతిన్ చెబుతూ పోర్న్ కంటెంట్‌ను నిషేధించడమే ఈ సమస్యకు ఒక పరిష్కారమని అన్నారు. అయితే పోర్న్ కంటెంట్ కంటే మరింత ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయాలు చూపించడం చాలా అవసరమని పుతిన్ తెలిపారు.
ehatv
Next Story