రష్యాలోని (Russia) యకుటియా ప్రాంతంలో ఒక విమానం గడ్డకట్టి ఉన్న నదిపై (frozen river) ల్యాండైంది. సోవియట్ కాలం నాటి అంటోనోవ్ యాన్ 24 విమానం (Soviet-era Antonov An-24 plane) జిర్యాంక ( Zyryanka) విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. అయితే, రన్ వే పూర్తిగా మంచులో కూరుకుపోయింది.

రష్యాలోని (Russia) యకుటియా ప్రాంతంలో ఒక విమానం గడ్డకట్టి ఉన్న నదిపై (frozen river) ల్యాండైంది. సోవియట్ కాలం నాటి అంటోనోవ్ యాన్ 24 విమానం (Soviet-era Antonov An-24 plane) జిర్యాంక ( Zyryanka) విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. అయితే, రన్ వే పూర్తిగా మంచులో కూరుకుపోయింది. పక్కనే ఉన్న కొలిమా నది కూడా గడ్డకట్టింది. చూసేందుకు రెండూ ఒకేలా ఉండటంతో గందరగోళానికి గురైన పైలట్ విమానాన్ని గడ్డకట్టిన నదిపై దించారు. ఆ సమయంలో విమానంలో 30 మంది ప్రయాణికులున్నారు. ఎవరికీ గాయాలు కాలేదు. ఈ విమానం రష్యాలోని ఫార్‌ ఈస్ట్‌ సఖా రిపబ్లిక్‌ యాకుట్స్క్‌ (Yakutsk) నుంచి ఈ విమానం బయల్దేరింది. ఇది ఈశాన్య దిశలో 1,100 కి.మీ (685 మైళ్ళు) జిర్యాంకాకు చేరుకుంది, యాకుట్స్క్‌కు తిరిగి రావడానికి ముందు స్రెడ్నెకోలిమ్స్క్‌లోని మరొక చిన్న పట్టణానికి వెళ్లాల్సి ఉంది. ఈ విమానం ల్యాండింగ్‌ సమయంలో జిర్యాంకాలో -40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Updated On 28 Dec 2023 10:48 PM GMT
Ehatv

Ehatv

Next Story