Ruki River In Africa : కాటుకను మించిన నల్లని నది... ఎందుకలా?
నదిలో నీళ్లు ఎలా ఉంటాయి? ఇదేం ప్రశ్న..స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉంటాయి. లేదూ మట్టిరంగులో ఉంటాయి. కొన్ని నదుల నీళ్లు మురికిగా కూడా ఉంటాయి. కానీ అదేం చిత్రమో కానీ ఆ నదిలోనీ నీళ్లు మాత్రం నల్లగా ఉంటాయి. అందుకే ఆనది ప్రపంచంలోనే అత్యంత నల్లని నదిగా పేరపొందింది. ఎందుకలా? అంటే ఆ నది నీటిలో కరిగిన సేంద్రియ పదార్థమేనని(organic material) శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆఫ్రికా దేశమైన(africa) కాంగోలో(cango) ఉన్న ఈ నది పేరు రుకీ(Ruki)..
నదిలో నీళ్లు ఎలా ఉంటాయి? ఇదేం ప్రశ్న..స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉంటాయి. లేదూ మట్టిరంగులో ఉంటాయి. కొన్ని నదుల నీళ్లు మురికిగా కూడా ఉంటాయి. కానీ అదేం చిత్రమో కానీ ఆ నదిలోనీ నీళ్లు మాత్రం నల్లగా ఉంటాయి. అందుకే ఆనది ప్రపంచంలోనే అత్యంత నల్లని నదిగా పేరపొందింది. ఎందుకలా? అంటే ఆ నది నీటిలో కరిగిన సేంద్రియ పదార్థమేనని(organic material) శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆఫ్రికా దేశమైన(africa) కాంగోలో(cango) ఉన్న ఈ నది పేరు రుకీ(Ruki).. దీని నీళ్లు ఎంత నల్లగా ఉంటాయంటే అందులో చేతులు కూడా కడుక్కోలేం! నదిలోని నీటికి నలుపు రంగు రావడానికి కారణం వర్షారణ్యం నుండి సేంద్రియ పదార్థాలు వచ్చి, ఈ నీటిలో కలవడమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాంగోలో స్విట్జర్లాండ్ కంటే నాలుగు రెట్లు అధికమైన డ్రైనేజీ(Drainage) బేసిన్ ఉంది. ఇందులో కుళ్లిన చెట్లు, మొక్కల నుండి వచ్చే కార్బన్ సమ్మేళనాలు పేరుకుపోతున్నాయి. ఇవి వర్షాలు, వరదల కారణంగా నదులలోకి చేరుకుంటున్నాయి. నీటిలో కరిగిన ఇటువంటి కార్బన్ సమ్మేళనాల సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. మరో విషయమేమిటంటే అమెజాన్ రియో నెగ్రా కంటే కురీ నది ఒకటిన్నర రెట్లు లోతుగా ఉంటుందట!ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నల్ల నీటి నదిగా పేరు తెచ్చుకుంది.