Blood Money: అతడి కోసం 34 కోట్లు సేకరించారు
కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ 2006లో హౌస్ డ్రైవర్ వీసాపై రియాద్‌కు వెళ్లాడు.
సౌదీ అరేబియాలో జైలులో ఉన్న కోజికోడ్‌కు చెందిన ఒక వ్యక్తి విడుదల కోసం సుమారు రూ. 34 కోట్లు సేకరించే లక్ష్యాన్ని కేరళ వాసులు పెట్టుకున్నారు. కేరళలో జరుగుతున్న అతిపెద్ద క్రౌడ్ ఫండింగ్ ప్రయత్నాలలో ఇది ఒకటి. సౌదీ అరేబియాలో ప్రమాదవశాత్తు బాలుడి మరణానికి కారణమయ్యాడనే ఆరోపణలతో మరణశిక్ష విధించబడిన అబ్దుర్ రహీమ్‌ను విడుదల చేయడం కోసం క్రౌడ్ ఫండింగ్ ను లక్ష్యంగా పెట్టుకున్నారు. అతను సౌదీ అరేబియాలో 18 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు.
కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ 2006లో హౌస్ డ్రైవర్ వీసాపై రియాద్‌కు వెళ్లాడు. తన డ్రైవింగ్ విధులతో పాటు, అతను దివ్యాంగుడైన సౌదీ అబ్బాయిని చూసుకున్నాడు. రహీమ్, ఆ బాలుడు కలిసి ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆ పిల్లాడికి ఉంచిన లైఫ్ సపోర్ట్ పరికరం ప్రమాదవశాత్తూ వేరుచేయబడింది. ప్రమాదాన్ని నివారించడానికి రహీమ్ ప్రయత్నించినప్పటికీ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. 2018లో ఈ ఘటనకు సంబంధించి సౌదీ చట్టం ప్రకారం రహీమ్‌కు మరణశిక్ష విధించారు. అయితే 34 కోట్ల రూపాయలను ‘బ్లడ్ మనీ’గా చెల్లిస్తే రహీమ్‌కు క్షమాభిక్ష ప్రసాదించవచ్చని బాలుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించింది ప్రభుత్వం.
భారతదేశంలో సేకరించిన నిధులు రహీమ్ విడుదలను సులభతరం చేస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా రియాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి బదిలీ చేస్తారు. ఈ క్రమంలోనే ఈ నెల 18వ తేదీలోగా సుమారు రూ. 34 కోట్లు చెల్లించినట్లయితే మరణశిక్ష తప్పుతుంది. తాజాగా ఈ పెద్ద మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయులు సమీకరించి అతడికి జైలు నుండి విముక్తుడిని చేయాలని చూశారు