యధార్థ సంఘటనలే అయినా కొన్ని నమ్మశక్యం కాకుండా ఉంటాయి. అలాంటి వాటిని మనం అద్భుతాలుగా చెప్పుకుంటాం! లేదా అదృష్టం కలిసివచ్చిందని భావిస్తుంటాం! ఇప్పుడు చెప్పుబోయే సంఘటన అద్భుతమో, అదృష్టమో కానీ ఓ మహిళ చచ్చి బతికింది! సమాధిలోంచి(Grave) 11 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడింది. నమ్మడం లేదు కదూ! ఇది నిజంగా జరిగింది.

యధార్థ సంఘటనలే అయినా కొన్ని నమ్మశక్యం కాకుండా ఉంటాయి. అలాంటి వాటిని మనం అద్భుతాలుగా చెప్పుకుంటాం! లేదా అదృష్టం కలిసివచ్చిందని భావిస్తుంటాం! ఇప్పుడు చెప్పుబోయే సంఘటన అద్భుతమో, అదృష్టమో కానీ ఓ మహిళ చచ్చి బతికింది! సమాధిలోంచి(Grave) 11 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడింది. నమ్మడం లేదు కదూ! ఇది నిజంగా జరిగింది. బ్రెజిల్‌లోని(Brazil) 37 ఏళ్ల రోసాంజెలా అల్మేడా(Rosangela Almeida) అనే మహిళ గుండెపోటుతో కన్నుమూసింది. ఆమె డెత్‌ సర్టిఫికెట్‌లో(Death certificate) అలాగే ఉంది మరి! బంధువులు బాధాతప్త హృదయంతో దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఆమె భౌతికకాయాన్ని ఖననం చేశారు. ఆమె సమాధి అయిన తర్వాత చుట్టుపక్కల వాళ్లకు సమాధిలోంచి వింత శబ్దాలు వినిపించాయి.

ఓ మనిషి మూలుగు వినిపించేది. ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. వెంటనే బంధువులు ఆమె సమాధి దగ్గరకు వచ్చారు. అప్పటికే ఆమెను సమాధి చేసి 11 రోజులు గడిచిపోయాయి. సమాధిని తవ్వడం మొదలు పెట్టారు. శవపేటికను వెలికితీశారు. అల్మెడా శరీరం వేడిగా ఉండటమే కాకుండా శ్వాస తీసుకోవడం చూసి బంధువులు కంగుతిన్నారు. ఇక్కడ మరో దిగ్భ్రాంతి కలిగించే విషయం మరోటి ఉంది. ఆమెను ఖననం చేసినప్పుడు శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం నుదిటిపై, మణికట్టుపై తీవ్ర గాయాలు ఉన్నాయి.

కొంత మంది సాక్ష్యులు కూడా ఆమె చినిపోయి ఉండకపోవచ్చని, తాము చూసేటప్పటికీ ఆమె శరీరం వెచ్చగానే ఉందని చెప్పారు. ఇన్నేసి మలుపులు ఉన్న అల్మెడా కథ విషాదంగా ముగియడమే పెద్ద విషాదం. సమాధి నుంచి తీసిన తర్వాత అల్మెడా సజీవంగా లేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చారు. విచారణ జరిపారు. అల్మెడాను సజీవంగా సమాధి చేశారనడంలో ఎలాంటి నిజం లేదని తెలుసుకున్నారు. కాకపోతే ఓ వ్యక్తి సమాధిని తవ్వి ఆమె ఆత్మకు శాంతి చేకూరకుండా భంగం కలిగించినందుకు కొందరిపై అభియోగాలు మోపి అరెస్ట్‌ చేశారు

Updated On 17 Aug 2023 8:13 AM GMT
Ehatv

Ehatv

Next Story