Romania : ఎలుగుబంట్లను చంపేందుకు సిద్ధమైన రొమేనియా ... ఎందుకంటే ..?
కొంతకాలంగా రొమేనియాలో(Romenia) ఎలుగుబంట్ల(bears) దాడులు పెరిగిపోతున్నాయి.
కొంతకాలంగా రొమేనియాలో(Romenia) ఎలుగుబంట్ల(bears) దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ యువకుడిపై దాడి చేసి చంపేశాయి. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనతో అక్కడి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 500 ఎలుగుబంట్లను చంపాలనుకుంటోంది. ప్రభుత్వ నిర్ణయానికి పార్లమెంట్ ఆమోదం కూడా లభించింది. రొమేనియాలో దాదాపు 8 వేల ఎలుగుబంట్లు ఉన్నాయని అక్కడి పర్యావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కొన్నేళ్లుగా వీటి దాడులు బాగా పెరిగాయి. గత 20 ఏళ్లలో 26 మంది చనిపోయారు. 274 మంది తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా ఓ పర్వతారోహకుడిపై దాడి చేయడంతో అతడు ప్రాణాలు విడిచాడు. దీంతో ప్రభుత్వం అత్యవసరంగా పార్లమెంట్‌ను సమావేశపరచింది. ఎలుగుబంట్ల జనాభా ఎక్కువకావడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి దాడులను అరికట్టడానికి ఈ ఏడాది 481 ఎలుగుబంట్లను చంపాలనే నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది 220 ఎలుగుబంట్లను చంపేశారు. అయితే పర్యావరణ సంఘాలు, జంతు ప్రేమికులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.