అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు మృతిచెందారు.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులను రంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వివరాల్లోకి వెల్తే అమెరికాలోని ఫ్లోరిడాలో సోమవారం తెల్లవారుజామున భారత కాలమానం ప్రకారం 3:30 గంటకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు స్పాట్‌లో చనిపోయారు. మృతులను ప్రగతి రెడ్డి (Pragathi Reddy)(35), ఆమె కుమారుడు హార్వీన్(Harvin) (6), అత్త సునీత(Sunitha) (56)గా గుర్తించారు. వీరంతా రంగారెడ్డి (Ranga Reddy)జిల్లా షాద్‌నగర్‌(Shadnagar)లోని టేకులపల్లి(Tekulapalli) వాసులుగా తెలుస్తోంది. మృతులు మాజీ సర్పంచ్‌ మోహన్‌రెడ్డి కూతురు కుటుంబీకులని గుర్తించారు. వీరి మరణ వార్త తెలియడంతో స్వగ్రామంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ehatv

ehatv

Next Story