ఉద్యోగుల(Employees) బాగోగుల కోసం ఆస్ట్రేలియా (Australia)ప్రభుత్వం ఓ కొత్త చట్టాలన్ని అమలులోకి తీసుకువస్తున్నది.

ఉద్యోగుల(Employees) బాగోగుల కోసం ఆస్ట్రేలియా (Australia)ప్రభుత్వం ఓ కొత్త చట్టాలన్ని అమలులోకి తీసుకువస్తున్నది. ఈ చట్టం ప్రకారం పని గంటలు పూర్తయిన తర్వాత ఉద్యోగులు తమ బాసులను పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే పని నుంచి దూరంగా వ్యక్తిగత జీవితాన్ని గడిపేయవచ్చు. నిజానికి ఆస్ట్రేలియాలో ఈ చట్టాన్ని ఫిబ్రవరిలోనే పాస్‌ చేశారు. వచ్చే సోమవారం నుంచి ఇంప్లిమెంట్‌ అవుతున్నది. ఆస్ట్రేలియా పార్లమెంట్‌లోకి ఈ కొత్త చట్టం రాగానే చాలా సంస్థలు దీన్ని వ్యతిరేకించాయి. ఇది తొందరపాటు చర్య అని, లోపభూయిష్టంగా ఉందని వాదించాయి. రైట్‌ టు డిస్‌కనెక్ట్‌(Right To Disconnect)చట్టంలో ఉద్యోగి హోదా, బాస్‌(Boss)తో మాట్లాడేందుకు ఎందుకు తిరస్కరిస్తున్నారో కారణం చెప్పాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాలోని ఫెయిర్‌ వర్క్‌ యాక్ట్‌లోని లోపాలను పూడ్చేందుకు ఈ సరికొత్త చట్టాన్ని అమలు చేయనున్నారు. దీంతో పాటు తక్కువ వేతనాలు ఇవ్వడాన్ని క్రిమినలైజ్‌ చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో పాటు యజమానులు ఉద్యోగులను నియమించుకొనే చట్టాల్లో కూడా మార్పులు తీసుకురానున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్‌(Frances),జర్మనీ(Germani)వంటి దేశాల్లో పని గంటల తర్వాత ఉద్యోగులు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేసుకోవచ్చు. బ్రిటన్‌(Briton)లో కూడా లేబర్‌ పార్టీ(Labour Party)ప్రభుత్వం రైట్‌ టూ డిస్‌కనెక్ట్‌ చట్టాన్ని అమలుచేయాలని చూస్తోంది.

ehatv

ehatv

Next Story