Amusement Park Accident: చనిపోయిన యువకుడి కుటుంబానికి 2,624 కోట్ల రూపాయల పరిహారం!
సుమారు మూడేళ్ల కిందట అమెరికాలో అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో ఓ విషాద ఘటన జరిగింది.

సుమారు మూడేళ్ల కిందట అమెరికాలో అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో ఓ విషాద ఘటన జరిగింది.
నిట్టనిలువుగా కిందకు దూసుకొచ్చే ఫ్రీ ఫాల్ టవర్ డ్రాప్ రైడ్‌లో ప్రమాదవశాత్తు పైనుంచి పడిపోయి ఓ టీనేజర్ ప్రాణాలు కోల్పోయాడు. ఫ్లోరిడాలోని ఐకాన్ పార్క్(Florida IconPark)లో ఫన్‌టైమ్ హ్యాండిల్స్ అనే సంస్థ ఈ రైడ్‌ను నిర్వహించింది. 400 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లి గంటకు 112 కిలోమీటర్లవేగంతో కిందకు దూసుకొస్తుంది. 2022 మార్చిలో 14 ఏళ్ల టైర్ శాంప్సన్ తన తోటి ఫుట్‌బాల్ టీమ్‌తో ఈ రైడ్ ఎక్కాడు. టైర్ శాంప్సన్ ఆరు అడుగుల ఎత్తు ఉంటాడు. 173 కిలోల బరువు ఉంటాడు. నిబంధనల ప్రకారం ఇతడిని రైడ్‌కు అనుమతించకూడదు. 129 కిలోల బరువుంటేనే రైడ్‌కు అనుమించరు. మరి శాంప్సన్‌ను ఎలా అనుమతించారో తెలియదు. రెండుసార్లు పైకీ కిందకు సురక్షితంగా వెళ్లొచ్చిన శాంప్సన్ మూడోసారి పట్టుతప్పాడు. 70 అడుగుల ఎత్తులో టవర్ నుంచి వేగంగా కిందకు పడ్డాడు. ఈ ఘటనలో శాంప్సన్ అక్కడికక్కడే చనిపోయాడు. అధిక బరువు, సేఫ్టీ సీట్ లాక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు శిక్షగా ఫన్‌టైమ్ హ్యాండిల్స్ సంస్థకు 310 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది న్యాయస్థానం. మన కరెన్సీలో చెప్పాలంటే 2,624 కోట్ల రూపాయలు. ఈ మొత్తం నుంచి శాంప్సన్ తల్లిదండ్రులకు తలో 155 మిలియన్ డాలర్లు నష్టపరిహారంగా అందజేయాలని కోర్టు ఆదేశించింది.!
