Rebecca Joynes : విద్యార్థితో మహిళా టీచర్ రాసలీలలు
పాఠాలు నేర్పించాల్సిన ఓ మహిళా టీచర్(Female Teacher) తను విద్యార్థులపైనే కన్నేసింది. తన వద్ద పాఠాలు నేర్చుకుంటున్న బాలురిని లోబర్చుకుంది. తన కంటే వయసులో ఎంతో చిన్నవాడైన విద్యార్థితో రాసలీలల్లో మునిగితేలింది. అమాయక బాలురను లోబర్చుకొని తన కామ కోరికలు తీర్చుకుంది.
పాఠాలు నేర్పించాల్సిన ఓ మహిళా టీచర్(Female Teacher) తను విద్యార్థులపైనే కన్నేసింది. తన వద్ద పాఠాలు నేర్చుకుంటున్న బాలురిని లోబర్చుకుంది. తన కంటే వయసులో ఎంతో చిన్నవాడైన విద్యార్థితో రాసలీలల్లో మునిగితేలింది. అమాయక బాలురను లోబర్చుకొని తన కామ కోరికలు తీర్చుకుంది. ఇది బయటకు పొక్కడంతో కోర్టు వరకు వెళ్లింది. ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన అదే టీచర్ మరో బాలుడితో కామకోరికలు తీర్చుకుంది. దీంతో ఆమె గర్భం కూడా దాల్చింది. ఈ కామ టీచర్ వ్యవహారం ఇప్పుడు యూకేలో(UK) చర్చనీయాంశమైంది.
యూకేకు చెందిన 30 ఏళ్ల రెబక్కా జాయ్‌నెస్(Rebecca Joynes) అనే మహిళా టీచర్ వ్యవహారం సంచలనంగా మారింది. 2021లో ఓ విద్యార్థికి గణితంలో ట్యూషన్ చెప్తుండేది. అదే సమయంలో 11 అంకెల ఫోన్ నెంబర్లో ఒక్కటి తప్ప మిగిలిన అంకెలను బాలుడికి చెప్పింది. తన మొబైల్ నెంబర్ కనుక్కోవాలని ఛాలెంజ్ చేసింది. ఆ తరవాత వారిద్దరి మధ్య మెసేజెస్ ప్రారంభమయ్యాయి. దీంతో ఇద్దరి మధ్య బంధం బలపడింది. ఈ క్రమంలో ఓ రోజు విద్యార్థిని ఓ షాపింగ్ మాల్‌కు తీసుకెళ్లి ఖరీదైన గూచీ బెల్డ్ కొనింది. ఇందు కోసం 345 పౌండ్లు ఖర్చుచేసింది. సీసీటీవీలో ఈ దృశ్యాలు ఉన్నాయి. ఆ తర్వాత అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. అక్కడ ఇరువురు రతి క్రీడలో పాల్గొన్నారు. టీచర్‌తో తన రంకు బాగోతాన్ని బాలుడు మరో విద్యార్థితో పంచుకున్నాడు. తన మిత్రుడికి చెప్పడంతో అది పోలీసులకు చేరింది. దీంతో టీచర్ జాయ్‌నెస్‌ను అరెస్టు చేశారు. కొన్నాళ్ల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చింది. కేసు విచారణలో ఉండగానే జాయ్‌నెస్ మరో బాలుడికి దగ్గరైంది. స్నాప్ చాట్‌లో పరిచయం పెంచుకొని తన నగ్న ఫొటోలను పంపించి వలపు వల విసిరింది. అతిడితో సెక్స్ కోరికలు తీర్చుకొని ఏకంగా కన్సీవ్ అయిందని ప్రాసిక్యూటర్లు తెలిపారు. అయితే ఈ కేసులో టీచర్ మాత్రం తన వాదనలను వినిపిస్తోంది. 16 ఏళ్లు నిండిన తర్వాతే బాలుడితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు వాదిస్తోంది. యూకేలో సంచలనం సృష్టించిన ఈకేసు విచారణ కోర్టులో ఉంది.