Disney River Country theme Park : ఒకప్పడు పర్యాటకులతో కళకళలాడిన పార్క్.. ఇప్పుడు దెయ్యాల ఆవాసంగా మారింది..
ఒకప్పుడు జనాలతో కళకళలాడిన ఆ పార్కు(Park) ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. భయంకరమైన నిశ్శబ్దం అక్కడ తాండవిస్తోంది. అప్పుడప్పుడు వినిపించే కీచురాళ్ల చప్పుళ్లు భీతి కొల్పుతుంటాయి. దేశ విదేశాల సందర్శకులను అమితంగా ఆకట్టుకున్న ఆ డిస్నీ రివర్ కంట్రీ థీమ్ పార్క్(Disney River Country theme Park) రెండు దశాబ్దాలుగా మూతబడే ఉంది.
ఒకప్పుడు జనాలతో కళకళలాడిన ఆ పార్కు(Park) ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. భయంకరమైన నిశ్శబ్దం అక్కడ తాండవిస్తోంది. అప్పుడప్పుడు వినిపించే కీచురాళ్ల చప్పుళ్లు భీతి కొల్పుతుంటాయి. దేశ విదేశాల సందర్శకులను అమితంగా ఆకట్టుకున్న ఆ డిస్నీ రివర్ కంట్రీ థీమ్ పార్క్(Disney River Country theme Park) రెండు దశాబ్దాలుగా మూతబడే ఉంది. ఇప్పుడది దెయ్యాల నివాసంగా మారింది. ఎందుకలా? అసలేం జరిగింది?
వాల్డ్ డిస్నీ కంపెనీ 1976, జూన్ 20న ఫ్లోరిడాలోని(Florida) బే లేక్ తీరం(Bay Lake) దగ్గర డిస్నీ రివర్ కంట్రీ పార్క్‌ను నెలకొల్పింది. వాల్డ్ డిస్నీ కంపెనీకి చెందిన అన్ని పార్కుల్లాగే ఇది కూడా నిత్యం ప్రజలతో కిక్కిరిసిపోయి ఉండేది. ఇందులోని రెండు స్విమ్మింగ్ పూల్స్, అయిదు వాటర్ స్లైడ్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉండేవి.
వీటికోసం నీటిని దగ్గరలోనే ఉన్న బే లేక్ నుంచి సరఫరా చేసేవారు. బే లేక్ నుంచి వచ్చే నీటిని ఫిల్టర్ చేయడానికి అడుగు భాగంలో ఇసుక నింపిన ఫిల్టర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. 1980 వరకు డిస్నీ రివర్ కంట్రీ థీమ్ పార్క్ బాగానే నడిచింది. ఆ తర్వాతే స్విమ్మింగ్‌పూల్స్‌ల, వాటర్ స్లైడ్స్‌లో ఉన్న నీటిపై ప్రజలకు అనుమానాలు మొదలయ్యాయి. అనుమానాలే కాదు, ఆందోళనలు కూడా రేగాయి. ఇక్కడి ఈత కొలనులో ఈత కొట్టిన పదకొండేళ్ల బాలుడి మెదడులో అబీబిక్ ఇన్ఫెక్షన్(Amoebic infection) ఏర్పడింది. ఆ ఇన్ఫెక్షన్ ఆ బాలుడి ప్రాణాలను బలి తీసుకుంది.
1982లో మరో బాలుడు ఇదే కారణంతో చనిపోయాడు. దాంతో ప్రజల్లో ఆందోళన బాగా పెరిగింది. 1989లో ఇంకో బాలుడు నీటి వల్ల కలిగే ఇన్ఫెక్షన్లతో చనిపోయాడు. చనిపోయినవారి సంఖ్యే మనకు తెలుస్తున్నది కానీ, ఇన్ఫెక్షన్ బారిన పడి చికిత్స తీసుకున్నవారు చాలా మంది ఉన్నారు. వారి అదృష్టం బాగుండటం వల్ల బతికి బట్టకట్టగలిగారు. ఈ మరణాల తర్వాత ఈ పార్క్‌కు వెళ్లడానికి జనం భయపడ్డారు. నెమ్మదిగా పర్యాటకుల సంఖ్య తగ్గడం మొదలయ్యింది. ఒకానొక దశలో పదుల సంఖ్యకు చేరుకుంది.
దాంతో వాల్డ్ డిస్నీ కంపెనీ 2001 నవంబర్ 2న పార్క్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. నీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా ఆధునీకరిస్తామని, 2002 ఏప్రిల్ 11 మళ్లీ తెరుస్తామని తెలిపింది. అలా ప్రకటించింది కానీ మళ్లీ ఆ పార్క్ తెరచుకోలేదు. శాశ్వతంగా మూతబడింది. ఇప్పుడది పూర్తిగా పాడుబడింది. ఇలాంటి వైఫల్యం వాల్డ్ డిస్నీ కంపెనీ చరిత్రలో అంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ఆ తర్వాత కూడా జరగలేదు..