మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో వరల్డ్‌వైడ్‌ స్టార్‌ అయ్యాడు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు.

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో వరల్డ్‌వైడ్‌ స్టార్‌ అయ్యాడు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. త్వరలోనే రామ్‌చరణ్‌(Ram Charan) మరో ఘనతను సాధించబోతున్నాడు. సింగపూర్‌(Singapore)లోని ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం(Madame Tussauds)లో రామ్‌చరణ్‌ మైనపు బొమ్మను(Ram Charan wax statues) ఏర్పాటు చేయబోతున్నారు. రామ్‌చరణ్‌తో పాటు ఆయన పెంపుడు కుక్క రైమీ(Rhyme) కూడా ఆ విగ్రహంలో చోటు సంపాదించుకోబోతున్నది. ఇందుకు సంబంధించిన ఫోటో షూట్‌ను కంప్లీట్ చేశారు. త్వరలోనే మైనపు బొమ్మను రూపొందించి, ఆవిష్కరిస్తామని ఐఫా వేదికగా టూస్సాడ్స్‌ టీమ్‌ ప్రకటించింది. టూస్సాడ్స్‌ కుటుంబంలో తానూ భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని రామ్‌చరణ్‌ అన్నారు. మన దేశానికి చెందిన స్టార్‌ హీరోల మైనపు బొమ్మలను ఇతర దేశాల మ్యూజియంలలో ఇది వరకే ఏర్పాటు చేశారు. అమితాబ్‌బచ్చన్‌(Amitabh Bachchan), షారూక్‌ఖాన్‌(Shah Rukh Khan), అమీర్‌ ఖాన్‌(Amir Khan), సల్మాన్‌ఖాన్‌(Salman Khan), హృతిక్‌ రోషన్‌( Hrithik Roshan) .. ఇలా చాలా మంది మైనపు బొమ్మలు మ్యూజియంలలో కొలువు తీరాయి. మన తెలుగు హీరోల విషయానికి వస్తే మహేశ్‌బాబు(Mahesh Babu), ప్రభాస్‌(Prabhas), అల్లు అర్జున్‌(Allu Arjun)లకు మాత్రమే ఈ గౌరవం దక్కింది. ఇప్పుడు రామ్‌చరణ్‌ వారి సరసన చేశాడు.

ehatv

ehatv

Next Story