Ibrahim Raisi : ఇజ్రాయెల్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్...
ఇజ్రాయెల్‌ను(Israel) ఇరాన్(Iran) మరోసారి హెచ్చరించింది. తమ దేశంలో ఎలాంటి దాడికి దిగినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని ప్రకటిస్తూ ప్రతి చర్యలకు తమ ఎయిర్‌ఫోర్స్(Airforce) సిద్ధంగా ఉందని ఇరాన్ తెలిపింది. మరోవైపు ఇరాన్‌పై ఎలాంటి దాడులు చేయాలనే దానిపై చర్చించడానికి ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ భేటీ అయ్యింది. ఈ నేపథ్యలోనే ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
ఇజ్రాయెల్‌ను(Israel) ఇరాన్(Iran) మరోసారి హెచ్చరించింది. తమ దేశంలో ఎలాంటి దాడికి దిగినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని ప్రకటిస్తూ ప్రతి చర్యలకు తమ ఎయిర్‌ఫోర్స్(Airforce) సిద్ధంగా ఉందని ఇరాన్ తెలిపింది. మరోవైపు ఇరాన్‌పై ఎలాంటి దాడులు చేయాలనే దానిపై చర్చించడానికి ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ భేటీ అయ్యింది. ఈ నేపథ్యలోనే ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ కనుక దాడులకు పాల్పడితే తమ స్పందన తీవ్రంగా ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రెయిసీ(Ibrahim Raisi) చెప్పారు. అయితే ఇరాన్‌లోని లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడి చేస్తుందా? లేక ఇరాన్ వెలుపల దాడులకు దిగుతుందా? అనేది తేలాల్సి వుంది.
ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఇందులో ఇరాన్‌కు చెందిన 13 మంది ఆర్మీ ఉన్నతాధికారులు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా ఏప్రిల్ 1వ తేదీన ఇరాన్ వందలాది డ్రోన్‌లు, మిసైళ్లతో(Missiles) ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. వీటిలో 99 శాతం మిసైళ్లను ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ వ్యవస్థ సహకారంతో కూల్చి వేసింది.