Divorce : పెళ్లయిన మూడు నిమిషాల్లోనే విడాకులు.. కారణం తెలిస్తే బిత్తరపోతారు
పెళ్లి పెటాకులవ్వడానికి కొంత సమయం పడుతుంది. పెళ్లయిన కొత్తలో దంపతులు సర్దుకుపోతారు. ఆ తర్వాత పొరపొచ్చాలొస్తాయి. కానీ కువైట్లో ఓ నవ దంపతులు అలా కాదు.
పెళ్లి పెటాకులవ్వడానికి కొంత సమయం పడుతుంది. పెళ్లయిన కొత్తలో దంపతులు సర్దుకుపోతారు. ఆ తర్వాత పొరపొచ్చాలొస్తాయి. కానీ కువైట్(Kuwait)లో ఓ నవ దంపతులు అలా కాదు. వీరిద్దరు భార్యాభర్తలు అని కోర్టులో న్యాయమూర్తి ప్రకటించిన మూడు నిమిషాల్లోనే విడాకులు తీసుకున్నారు. ఆ విధంగా రికార్డు సృష్టించారు. 2019లో జరిగిన ఈ పెళ్లి, పెటాకులు ఇప్పుడు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం, యువతి, యువకుడు కోర్టులో వివాహ రిజిస్ట్రేషన్ కోసం వెళ్లారు. నిబంధనల ప్రకారం జడ్జి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. వీరిద్దరూ భార్యభర్తలని ప్రకటించారు. తర్వాత ఇద్దరూ సంతోషంగా కోర్టు నుంచి బయటకు వెళ్లసాగారు. ప్రమాదవశాత్తూ ఆ యువతి కాలు జారి పడిపోయింది. అది చూసిన భర్త ఆమెకు పైకి లేపి నాలుగు సాంత్వన కలిగించే మాటలు చెప్పకుండా స్టుపిడ్ అని తిట్టాడు. ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ఎంత మొగడైతే మాత్రం అంత మాట అంటాడా అని అనుకుని వెంటనే జడ్డి దగ్గరకు వెళ్లింది. తమ వివాహాన్ని వెంటనే రద్దు చేయాలని కోరింది. న్యాయమూర్తి కూడా ఆమె మనోభావనను అర్థం చేసుకుని పెళ్లిని రద్దు చేశారు.