పారిస్ ఒలింపిక్స్‌లో(Paris olympics) ఏదొక పతకం సాధిస్తుందని పీవీ సింధుపై(PV sindhu) పెట్టుకున్న ఆశలు అడి ఆశలయ్యాయి.

పారిస్ ఒలింపిక్స్‌లో(Paris olympics) ఏదొక పతకం సాధిస్తుందని పీవీ సింధుపై(PV sindhu) పెట్టుకున్న ఆశలు అడి ఆశలయ్యాయి. ఈసారి హ్యాట్రిక్ కొడుతుందని అంతా ఊహించారు. కానీ సింధు ఓడింది. క్వార్టర్స్ చేరకుండానే ఒలింపిక్స్ నుంచి ఇంటిబాటపట్టింది. గురువారం బ్యాడ్మింటన్(Badminton) మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ లో ఆమె 19-21, 14-21తో చైనా(china) క్రీడాకారిణి హే బిన్ జియావో చేతిలో ఓటమిపాలయింది. తొలిగేమ్‌ను గెలిచే అవకాశాన్ని సింధు చేజార్చుకుంది. మ్యాచ్ ఆరంభంలో 1-5 తేడాతో వెనకబడ్డ సింధు..మళ్లి ఎంత ప్రయత్నించినా..ప్రత్యర్థి ఆమెకు ఆధిక్యం సాధించే ఛాన్స్ ఇవ్వలేదు. అయితే 19-19 స్కోరుతో సమం కావడంతో సింధకు మంచి అవకాశమే లభించింది. కానీ ప్రత్యర్థికి రెండు పాయింట్లు ఇచ్చింది. దీంతో గేమ్ ను కోల్పోవాల్సి వచ్చింది.ఆధిక్యంలోకి వెళ్లిన ఆనందంలో బిన్ జియానో రెండో గేమ్‌లో సత్తా చాటింది.

13-5 తో ఆధిక్యంతో దూసు కెళ్లింది. ఇక సింధు పుంజుకోలేక పోయింది. ప్రత్యర్థి అదే ఊపులో ఆడింది. ఈ దశలో సింధు మూడు పాయింట్లు సాధించినా..వెంటనే ప్రత్యర్థి రెండు పాయింట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసు కుంది.

Eha Tv

Eha Tv

Next Story