ఒలింపిక్స్ -2024 అంగరంగ వైభంగా ప్రారంభమయ్యాయి. 16 రోజులపాట జరిగి ఆగస్ట్ 11న ఈ క్రీడలు ముగియనున్నాయి

ఒలింపిక్స్ -2024 అంగరంగ వైభంగా ప్రారంభమయ్యాయి. 16 రోజులపాట జరిగి ఆగస్ట్ 11న ఈ క్రీడలు ముగియనున్నాయి. 2020 ఒలింపిక్స్(Olympics)క్రీడలు టోక్యోలో(Tokyo) చివరిసారిగా ముగిశాయి. ఇప్పుడు పారిస్‌(paris) ఈ వేడుకలకు ఆతిథ్యం ఇస్తోంది. వందేళ్ల తర్వాత ఒలింపిక్స్‌కు ఫ్రాన్స్(france)ఆథిత్యం ఇదే తొలిసారి. వేడుకలు ఆరంభం కావడానికి కొన్ని గంటల ముందు నుంచే పారిస్‌లో వర్షం కురిసింది. మధ్యాహ్నం తుంపర్లతో ఆరంభమైన వాన.. గేమ్స్ ఆరంభం అయ్యే సమయానికి జడివానగా మారింది. భారీ వర్షంలోనే పారిస్ సీన్ నదిలో(River) ఓపెనింగ్ సెర్మనీ ర్యాలీ కొనసాగింది. 6 కి.మీ. మేర 85 పడవలపై ఈ పరేడ్ జరిగింది. సుమారు 205 దేశాలకు చెందిన 6,800 మంది అథ్లెట్లు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. పీవీ సింధు(Pv Sindhu), శరత్ కమల్‌లు (sharath Kamal)భారత ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు వారిద్దరూ. మొత్తంగా భారత్(India) తరఫున 117 మంది అథ్లెట్లు ఈ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు.

పారిస్ ఒలింపిక్స్(Paris Olympics) ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Pm Narendra MOdi) భారత అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్‌కు పతకాలను తీసుకుని రావాలని ఆకాంక్షించారు. ప్రతి క్రీడాకారుడు దేశానికి గర్వకారణం కావాలని పేర్కొన్నారు. అయితే భారత్‌కు తొలిరోజే నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన షూటింగ్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో రమిత(Ramita Jindal)-అర్జున్‌ బబుతా(Arjun Babuta) జంట 628.7 స్కోర్‌తో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. మరో జంట వలరివన్‌( Valarivan)- సందీప్‌ సింగ్(sandeep singh) 626.3 పాయింట్లతో 12వ స్థానానికి పరిమితమైంది. టాప్‌-4లో ఉన్న వారు ఫైనల్‌ పోరుకు అర్హత సాధిస్తారు. మరోవైపు, 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ పురుషుల విభాగంలో సరబ్‌జోత్‌ సింగ్(Sarabjot Singh), అర్జున్‌ చీమా(Arjun Chima) పోటీ పడనున్నారు. మహిళల్లో మను బాకర్(Manu Bakar), రిథమ్‌ సంగ్వాన్‌(Rhythm Sangwan) జోడీ తలపడనుంది.

ehatv

ehatv

Next Story