87.97 శాతం ఓట్లతో పుతిన్ విజయం సాధించారు. ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావిత ప్రాంతంలో ఆన్‌లైన్‌ ఓటింగ్‌

వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం రష్యా ఎన్నికలలో రికార్డు స్థాయిలో విజయం సాధించారు. అధికారంపై గట్టి పట్టును సుస్థిరం చేసుకున్నారు. 71 ఏళ్ల పుతిన్ కొత్తగా మరో ఆరేళ్ల పదవీకాలాన్ని చేపట్టనున్నారు. జోసెఫ్ స్టాలిన్‌ను అధిగమించి.. 200 సంవత్సరాలకు పైగా రష్యాలో ఎక్కువ కాలం బాధ్యతలు చేపట్టిన నాయకుడుగా అవుతాడు. పుతిన్ 87.8% ఓట్లను గెలుచుకున్నారు. రష్యా సోవియట్ అనంతర చరిత్రలో వచ్చిన గొప్ప ఫలితాలు అని పోల్స్టర్ పబ్లిక్ ఒపీనియన్ ఫౌండేషన్ (FOM) చేసిన పోల్ వివరాలని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.

87.97 శాతం ఓట్లతో పుతిన్ విజయం సాధించారు. ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావిత ప్రాంతంలో ఆన్‌లైన్‌ ఓటింగ్‌కు అవకాశం కల్పించారు. 60 శాతానికి మించి పోలింగ్ శాతం నమోదయింది. పుతిన్‌పై మూడు పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీకి దిగారు.. అయితే పుతిన్ పాలనపై, ఉక్రెయిన్‌ యుద్ధంపై ఆ అభ్యర్థులు విమర్శలు చేయలేదు. పుతిన్‌కు రాజకీయ శత్రువైన అలెక్సీ నవల్నీ గత నెలలో చనిపోయిన నేపథ్యంలో ఎన్నికలు జరిగాయి. కమ్యూనిస్ట్ అభ్యర్థి నికోలాయ్ ఖరిటోనోవ్ కేవలం 4% కంటే తక్కువ ఓటింగ్ తో రెండవ స్థానంలో నిలిచారు, కొత్తగా వచ్చిన వ్లాడిస్లావ్ దావన్కోవ్ మూడవ స్థానంలో నిలిచారు. అల్ట్రా-నేషనలిస్ట్ లియోనిడ్ స్లట్స్కీ నాల్గవ స్థానంలో నిలిచారని ఫలితాలు సూచించాయి.

రష్యా, నాటో దళాల మధ్య యుద్ధాన్ని ఎవరూ కోరుకోరని.. అదే జరిగితే మూడవ ప్రపంచ యుద్ధం అడుగుదూరంలో ఉంటుందని పశ్చిమ దేశాలను పుతిన్ హెచ్చరించారు. రష్యా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నాటో దళాలు, రష్యా మధ్య యుద్ధం ముప్పు పొంచివుందంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ చెప్పారని.. పుతిన్ వద్ద మీడియా చెప్పగా.. ఆధునిక ప్రపంచంలో అన్నీ సాధ్యమేనని పుతిన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ యుద్ధాన్ని ఎవరూ కోరుకోరని పుతిన్ వ్యాఖ్యలు చేశారు.

Updated On 17 March 2024 9:06 PM GMT
Yagnik

Yagnik

Next Story