అల్లు అర్జున్‌ అన్ని రికార్డులను బద్దలు కొట్టేస్తున్నాడు. అమెరికాలో కూడా తన స్టామినా ఏమిటో నిరూపించుకున్నాడు.

అల్లు అర్జున్‌ అన్ని రికార్డులను బద్దలు కొట్టేస్తున్నాడు. అమెరికాలో కూడా తన స్టామినా ఏమిటో నిరూపించుకున్నాడు. మొన్నటి వరకు అమెరికా టాప్‌ -10 తెలుగు సినిమాలలో డార్లింగ్‌ ప్రభాస్‌ ఆధిపత్యమే కనిపించింది. టాప్‌ ప్లేస్‌లో బాహుబలి-2 ఉంది. సెకండ్‌ ప్లేస్‌లో కూడా ప్రభాస్‌ నటించిన కల్కి సినిమా ఉంది. టాప్‌ టెన్‌లో సలార్‌, బాహుబలి-1 సినిమాలు కూడా ఉన్నాయి. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ సినిమాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. అల్లు అర్జున్‌కు మాత్రం నిన్నటి వరకు అల వైకుంఠపురంలో సినిమా మాత్రమే ఉండింది. హనుమాన్‌, దేవర సినిమాలతో అల వైకుంఠపురములో స్థానం కూడా నెమ్మదిగా కిందకు జారుతోంది. ఇక పుష్ప1 సినిమా విషయానికి వస్తే అది అమెరికాలో రికార్డు కలెక్షన్లు సాధించలేకపోయింది. పుష్ప 2 సినిమా ఆ కరువునంతా తీర్చేసింది. ఇప్పుడు అమెరికా టాప్-10 తెలుగు గ్రాసర్స్ లిస్ట్ లోకి అల్లు అర్జున్‌ కూడా చేరాడు. పుష్ప-2 సినిమా 9.4 మిలియన్ డాలర్ల (అన్ని భాషల్లో కలిపి) వసూళ్లతో అమెరికా లో దూసుకుపోతోంది. ఈ ఒక్క సినిమాతో ఏకంగా టాప్-4కు చేరుకున్నాడు అల్లు అర్జున్‌.ప్రస్తుతం టాప్-10 టాలీవుడ్ గ్రాసర్స్ లిస్ట్ లో బాహుబలి-2, కల్కి, ఆర్ఆర్ఆర్ తర్వాత పుష్ప-2 కొనసాగుతోంది. ఈ క్రమంలో పుష్ప 2 సినిమాకు ఆర్‌ఆర్‌ఆర్‌ను బీట్‌ చేసే ఛాన్సెస్‌ చాలా ఉన్నాయి. అమెరికాలో పుష్ప 2 ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. తెలుగుతో పోలిస్తే హిందీ వెర్షన్‌ వసూళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరో అయిదారు రోజులు ఇదే ట్రెండ్‌ కొనసాగితే ఆర్ఆర్ఆర్‌ను పుష్ప-2 దాటేస్తుంది.

ehatv

ehatv

Next Story