పాలస్తీనాపై(Palestine) ఇజ్రాయెల్‌(Israel) తక్షణమే దాడులు ఆపాలని, కాల్పుల విరమణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ అమెరికాలో(America) కొందరు నిరసనకారులు(Protest) ఆందోళన చేపట్టారు. యూదు సంస్థలకు చెందిన సభ్యులు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. క్యాపిటల్‌ బిల్డింగ్‌ను(Capital Building) చుట్టుముట్టారు. నిరసనలకు అనుమతి తీసుకోకుండా బిల్డింగ్‌లోకి ప్రవేశించినందుకు 300మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పాలస్తీనాపై(Palestine) ఇజ్రాయెల్‌(Israel) తక్షణమే దాడులు ఆపాలని, కాల్పుల విరమణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ అమెరికాలో(America) కొందరు నిరసనకారులు(Protest) ఆందోళన చేపట్టారు. యూదు సంస్థలకు చెందిన సభ్యులు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. క్యాపిటల్‌ బిల్డింగ్‌ను(Capital Building) చుట్టుముట్టారు. నిరసనలకు అనుమతి తీసుకోకుండా బిల్డింగ్‌లోకి ప్రవేశించినందుకు 300మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గాజాలో ఆల్‌ రిహ్లా ఆసుపత్రిపై జరిగిన దాడిలో 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలసంఖ్యలో జనం క్షతగాత్రులయ్యారు. ఈ ఘటన యావత్‌ ప్రపంచాన్ని కలిచివేసింది. యుద్ధాన్ని ఆపేయాలంటూ రెండు దేశాలకు విజ్ఞప్తి చేశాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Bidden) కూడా ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటిస్తూనే కాల్పుల విరమణకు ఒప్పించే ప్రయత్నం చేశారు. బైడెన్ పర్యటన అనంతరం యుద్ధంలో ఇజ్రాయెల్ కాస్త పట్ట సడలించినట్లు తెలుస్తోంది. యుద్ధంలో దెబ్బతిన్న గాజాకు(Gaza) ఆహారం, నీటిని రఫా సరిహద్దు గుండా అందించడానికి అంగీకరించింది. అక్టోబర్‌ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్‌ దళాలు విరుచుకుపడ్డాయి. ఈ ఆకస్మిక దాడికి జవాబుగా ఇజ్రాయెల్‌ ఎదురుదాడికి దిగింది. హమాస్‌ అంతమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే యుద్ధంలో నాలుగు వేల మందికి పైగా మరణించారు.

Updated On 19 Oct 2023 5:00 AM GMT
Ehatv

Ehatv

Next Story