Palestine : క్రీస్తు నడయాడిన నగరం కళతప్పింది!
ప్రపంచానికి శాంతి మార్గం చూపించి, మనుషుల పాపాలను శిలువలో మోసి, ప్రజల కోసం ప్రాణాలు విడిచిన క్రీస్తు(Jesus Christ) నడయాడిన ప్రాంతం ఇప్పుడు కళావిహీనంగా మారింది.
ప్రపంచానికి శాంతి మార్గం చూపించి, మనుషుల పాపాలను శిలువలో మోసి, ప్రజల కోసం ప్రాణాలు విడిచిన క్రీస్తు(Jesus Christ) నడయాడిన ప్రాంతం ఇప్పుడు కళావిహీనంగా మారింది. పర్యాటకులతో సందడిగా ఉండాల్సిన పాలస్తీనా(Palestine) వీధులన్నీ ముళ్ల కంచెలతో, శిథిలాలతో దర్శనమిస్తున్నాయి. యుద్ధానికి విరామం ప్రకటించి తమను క్రిస్మస్(Christmas) వేడుకలను జరుపుకోనివ్వండి అంటూ కొందరు ఆందోళన చేయడం గమనించదగ్గ విషయం. ఆ నిరసనకారులను కూడా ఇజ్రాయెల్(Israel) అధికారులు వదల్లేదు. అందరిని జైల్లో పెట్టారు. ఇజ్రాయెల్ హామాస్ యుద్ధం కారణంగా క్రిస్మస్ వేడుకలను అధికారులు నిషేధంచారు. దీంతో వేలాది మంది నిరసనకారులు రోడ్డు మీదకు వచ్చారు. క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరిగే యూనియన్ స్కైర్ దగ్గర నిరసనలు మిన్నంటాయి. 83 అడుగుల ఎత్తైన క్రిస్మస్ ట్రీ దగ్గరకు పెద్ద ఎత్తున నిరసనకారుల వచ్చారు. అందులో ఒ శనివారం మధ్యాహ్నాం రెండు గంటల ప్రాంతంలో ఆ చెట్టును ఎక్కుతూ నినాదాలు చేశాడు. అతనికి మద్దతు తెలుపుతూ మరికొంతమంది నిరసనలు చేసినట్టు అధికారులు తెలిపారు.