Princess Diana : డయానా డ్రెస్‌కు రూ.9 కోట్లు..!
రాజకుమారి డయానా(Diana) దుస్తులు రికార్డ్ స్థాయి ధర పలికింది. గతంలో డయానా ధరించిన స్వెటర్, వివాహ దుస్తులు కోట్లల్లో పలికాయి. తాజాగా మరోసారి ఆమె దుస్తులు రికార్డ్(Record) సృష్టించాయి. దీంతో ప్రిన్స్ డయానాకున్న క్రేజ్ ఇంకా కొనసాగుతోందని స్పష్టమవుతోంది. తాజాగా డయానా ధరించిన మరో డ్రెస్‌కు వేలం(Auction) నిర్వహించగా అంచానాకు మించి 11 రెట్లు పలికింది. వేలంలో డయానా డ్రెస్ రూ.9 కోట్లు పలికింది.
రాజకుమారి డయానా(Diana) దుస్తులు రికార్డ్ స్థాయి ధర పలికింది. గతంలో డయానా ధరించిన స్వెటర్, వివాహ దుస్తులు కోట్లల్లో పలికాయి. తాజాగా మరోసారి ఆమె దుస్తులు రికార్డ్(Record) సృష్టించాయి. దీంతో ప్రిన్స్ డయానాకున్న క్రేజ్ ఇంకా కొనసాగుతోందని స్పష్టమవుతోంది. తాజాగా డయానా ధరించిన మరో డ్రెస్‌కు వేలం(Auction) నిర్వహించగా అంచానాకు మించి 11 రెట్లు పలికింది. వేలంలో డయానా డ్రెస్ రూ.9 కోట్లు పలికింది. 1985లో ఫోరెన్స్‌లోని బలేరినాలో ప్రిన్స్ డయానా ఈ డ్రెస్ ధరించింది. లండన్‌లోని(London) జూలియన్స్ నిర్వహించిన వేలంలో ఈ ధర పలకడంతో నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. ఇంత ధర పలకడంతో ఆ రోజుల్లేనే ప్రిన్స్ డయానా ఫ్యాషన్‌కు(Fashion) ఎంత ప్రాధాన్యమిచ్చారో తెలుస్తోందని నిర్వాహకులు అంటున్నారు. అయితే ఈ డ్రెస్‌కు నిర్వాహకులు వేలంలో దాదాపు రూ.83 లక్షలు నుంచి కోటి రూపాయల వరకు వస్తాయని అంచనా వేశారు. అయితే వారి అంచనాలకు అందని విధంగా 9 కోట్లు పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలో బతికి ఉన్నా లేకున్నా వారి జ్ఞాపకాలు, వారు వాడిన వస్తువులు, దుస్తులను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారనేదానికి ఇదే ఉదాహరణ అని భావిస్తున్నారు.