Prague University : యూనివర్సిటీల్లో కాల్పులు.. 15 మంది మృతి.. 30 మందికి గాయాలు..!
చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్‌లోని చార్లెస్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో 15 మంది మృత్యువాత పడ్డారు. 30 మందికిపైగా గాయాలయ్యాయి. 24 ఏళ్ల విద్యార్థి డేవిడ్ జాక్ తన తండ్రిని. కాల్చి చంపిన తర్వాత యూనివర్సిటీలో చొరబడి 14 మందిని కాల్చిచంపాడు.
చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్‌లోని చార్లెస్ యూనివర్సిటీలో (Charles University)కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో 15 మంది మృత్యువాత పడ్డారు. 30 మందికిపైగా గాయాలయ్యాయి. 24 ఏళ్ల విద్యార్థి డేవిడ్ జాక్ తన తండ్రిని. కాల్చి చంపిన తర్వాత యూనివర్సిటీలో చొరబడి 14 మందిని కాల్చిచంపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకొని చనిపోయాడు.రెండేళ్ల తన కూతురును కూడా అతడే చంపి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
కాల్పుల నుంచి తప్పించుకోవడానికి యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు యూనివర్సిటీ భవనాల నుంచి దూకారు.గాయపడిన వారిలో ఒకరు డచ్ జాతీయుడని డచ్ విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. కాల్పుల నుంచి తప్పించుకున్న కొందరు విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా తమ క్షేమ సమాచారన్ని బంధువులు, మిత్రులకు తెలియజేస్తున్నారు. ఈ విషాద ఘటనపై దేశ ప్రధానమంత్రి పీటర్ ఫియాలా స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని తెలిపారు. దేశ జెండాలను కిందికి దించి మౌనం పాటించాలని ప్రజలను ప్రధాని కోరారు.