పపువా(Papua) న్యూ గినియాలో(New Guinea) హింస చెలరేగింది. ఆ దేశంలోని ఉత్తర హైలాండ్స్‌లో(Highlands) ఉన్న రెండు గిరిజన తెగల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 64 మందికిపైగా చనిపోయారు(death). ఓ తెగ త‌మ దగ్గర ఉన్న ఆయుధాల‌తో మ‌రో తెగ‌పై ఫైరింగ్ చేసింది. ఎంగ్వా ప్రావిన్సులో ఈ హింస(Voilence) చోటుచేసుకున్న‌ది.

పపువా(Papua) న్యూ గినియాలో(New Guinea) హింస చెలరేగింది. ఆ దేశంలోని ఉత్తర హైలాండ్స్‌లో(Highlands) ఉన్న రెండు గిరిజన తెగల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 64 మందికిపైగా చనిపోయారు(death). ఓ తెగ త‌మ దగ్గర ఉన్న ఆయుధాల‌తో మ‌రో తెగ‌పై ఫైరింగ్ చేసింది. ఎంగ్వా ప్రావిన్సులో ఈ హింస(Voilence) చోటుచేసుకున్న‌ది. ఎన్నో ఏళ్ల నుంచి ప‌ర్వ‌త ప్రాంతాల్లో వ‌ర్గ పోరు న‌డుస్తోంది. అయితే ఇప్పుడు జరిగిన హింస ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. అక్ర‌మంగా ఆ దీవిలో ఆయుధాలు వ‌చ్చిన‌ట్లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. రాజ‌ధాని పోర్ట్ మోర్సీబీకి 600 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న వాబాగ్ ప‌ట్ట‌ణంలో ఎక్క‌డ చూసినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. అన్ని చోట్ల మాదిరిగానే ఇక్కడ కూడా భూమి, సంపద కోసం గిరిజనులు కొట్టుకుంటున్నారు. గత ఏడాది జులై నుంచి ఓ మూడు నెలల పాటు అక్కడ పూర్తి లాక్‌డౌన్‌ అమలు చేశారు. కర్ఫ్యూ, ట్రావెల్ ఆంక్షలు కూడా విధించారు. గత ఏడాది ఆగస్టులో భారీ హింస చోటు చేసుకుంది. పపువా న్యూ గినియా నుంచి వస్తున్న వార్తల పట్ల ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌ విచారం వ్యక్తం చేశారు.

Updated On 19 Feb 2024 4:03 AM GMT
Ehatv

Ehatv

Next Story