Texas Teacher Incident : మైనర్ బాలుడితో మహిళా టీచర్ రాసలీలలు..!
అమెరికాలో(America) ఆడ టీచర్ల(Teacher) అరాచకాలకు అంతులేకుండా పోయింది.
అమెరికాలో(America) ఆడ టీచర్ల(Teacher) అరాచకాలకు అంతులేకుండా పోయింది. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అనుకుంటూ కొత్త లాజిక్కులు చెప్తూ మైనర్ బాలురను ముగ్గులోకి దింపుతున్నారు. ఏదో ఒక సందర్భంలో ఇలాంటి ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా 53 ఏళ్ల వయసున్న ఓ మహిళా టీచర్ విద్యార్థితో(Minor student) నిర్మాణంలో ఉన్న భవనంలో సెక్స్ చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది. టెక్సాస్‌లో(Texas) ఈ ఘటన చోటు చేసుకుంది. డావెన్‌పోర్ట్ హైస్కూల్‌లో ఆర్ట్స్ టీచర్‌గా పనిచేస్తున్న జెన్నిఫర్ అనే మహిళ అదే స్కూల్‌లో చదువుతున్న విద్యార్థితో ఎఫైర్ పెట్టుకుంది. తనకున్న ఆర్ట్‌తో అతడిని ఆకట్టుకుంది. బాలుడిని నిర్మాణంలో ఉన్న భవనంలోకి తీసుకెళ్తుండగా స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది. జెన్నిఫర్‌దే తప్పు అని నిర్ధారణ జరిగితే 20 ఏళ్ల శిక్ష పడుతుందని న్యాయనిపుణులు చెప్తున్నారు. అయితే గత 10 ఏళ్లలో ఇలాంటి కేసులు దాదాపు 500 బయటపడ్డాయి. టీచర్లతో విద్యార్థులు ఎఫైర్ నడుపుతున్నట్లు చాలా నివేదికలు బయటపెట్టాయి. మైనర్లుగా ఉన్నప్పుడే స్మార్ట్ ఫోన్లు చూడడం, పోర్న్ సైట్లకు అడిక్ట్ కావడంతో ఎఫైర్ల పట్ల ఆసక్తి కలుగుతోందని వీటికి దూరం పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.