అమెరికా(America) అధ్యక్షుడు జో బైడెన్​తో(Joe Biden) ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. బిడెన్​ దంపతులు ఇచ్చిన ఆతిథ్యాన్ని మోదీ స్వీకరించారు. అయితే పురాతన అమెరికన్‌ బుక్‌ గ్యాలీతో(American Book Gallery) పాటు పాతకాలపు అమెరికన్ కెమెరాను(Camera) మోదీకి బైడెన్‌ బహూకరించారు. మరోవైపు, జిల్ బైడెన్‌కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని(Emrold Diamond) ప్రధాని మోదీ కానుకగా ఇచ్చారు.

అమెరికా(America) అధ్యక్షుడు జో బైడెన్​తో(Joe Biden) ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. బిడెన్​ దంపతులు ఇచ్చిన ఆతిథ్యాన్ని మోదీ స్వీకరించారు. అయితే పురాతన అమెరికన్‌ బుక్‌ గ్యాలీతో(American Book Gallery) పాటు పాతకాలపు అమెరికన్ కెమెరాను(Camera) మోదీకి బైడెన్‌ బహూకరించారు. మరోవైపు, జిల్ బైడెన్‌కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని(Emrold Diamond) ప్రధాని మోదీ కానుకగా ఇచ్చారు. బుధవారం వాషింగ్టన్‌లో(Washington) ప్రధాని మోదీకి అమెరికా సైన్యం గార్డ్ ఆఫ్ హానర్(Guard Of Honor) ఇచ్చింది. అనంత‌రం ప్రధాని మోదీ వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ ల‌తో భేటీ అయ్యారు. రెండు దేశాలకు ప్రత్యేకంగా భావిస్తున్న‌ ప్రధాని మోదీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. వైట్‌హౌస్‌లో(White house) అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌, ప్రథమ మహిళ జిల్‌ బిడెన్‌లకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక బహుమతులు అందజేశారు.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు ప్రత్యేక గంధపు పెట్టెను ప్రధాని మోదీ బహుకరించారు. ఇది జైపూర్‌కు చెందిన హస్తకళాకారుడు చేతితో రూపొందించారు. ఇది మైసూర్ నుండి సేకరించిన చందనంతో చెక్కబడిన వృక్ష, జంతుజాలల‌ ​​​​ఆకృతులను కలిగి ఉంది. ఈ పెట్టెలో వినాయకుని విగ్రహం ఉంటుంది. కోల్‌కతాకు చెందిన ఐదవ తరం వెండి కళాకారుల కుటుంబం ఈ విగ్రహాన్ని చేతితో తయారు చేసింది. పెట్టెలో దియా కూడా ఉంది. ఈ వెండి దియా కూడా కోల్‌కతాలోని ఐదవ తరం వెండి కళాకారుల కుటుంబ కళాకారులచే చేతితో తయారు చేయబడింది. లండన్‌లోని ఫేబర్ & ఫాబర్ లిమిటెడ్ ప్రచురించిన, యూనివర్శిటీ ప్రెస్ గ్లాస్గోలో ముద్రించిన 'ది టెన్ ప్రిన్సిపల్ ఉపనిషడ్స్' పుస్తకం యొక్క మొదటి ఎడిషన్ కాపీని కూడా ప్రధాని మోదీ.. అధ్యక్షుడు జో బిడెన్‌కు బహుమతిగా ఇచ్చారు.

యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్‌కు బహుమతిగా ఇచ్చిన పెట్టెలో 10 వ‌స్తువుతు ఉన్నాయి - గౌదాన్ (ఆవు దానం) కోసం ఆవు స్థానంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన నైపుణ్యం కలిగిన కళాకారులచే ప్రత్యేకమైన చేతితో తయారు చేసిన వెండి కొబ్బరికాయ, భూదాన్ (భూమి విరాళం) కోసం భూమి స్థానంలో మైసూర్ నుండి తీసుకెళ్లిన‌ చందనం, తమిళనాడు నుండి సేక‌రించిన‌ తెల్ల నువ్వులను టిల్ దాన్‌ (నువ్వుల దానం) కోసం.. రాజస్థాన్‌లో చేతితో తయారు చేసిన బంగారు నాణేన్ని హిరణ్యదాన్ (బంగారం విరాళం)గా అందజేశారు. అంతేకాదు పంజాబ్ నెయ్యి, జార్ఖండ్ తుషార్‌ సిల్క్‌, ఉత్త‌రాఖాండ్ పొడ‌వైన బియ్యం, మ‌హ‌రాష్ట్ర బెల్లంను కూడా ప్ర‌త్యేక బాక్స్‌ల‌లో జో బైడెన్ దంప‌తుల‌కు అంద‌జేశారు.

Updated On 22 Jun 2023 12:00 AM GMT
Ehatv

Ehatv

Next Story