ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అమెరికా పర్యటనపై భారతీయ ప్రవాసులు ఎంతో ఉత్కంఠగా ఉన్నారు. ప్రధాని మోదీ పర్యటనకు ముందు న్యూజెర్సీలోని ఓ రెస్టారెంట్.. ఆయన పేరిట ఫుడ్ ప్లేటర్‌ను ప్రారంభించిందంటే మోదీకి ఉన్న క్రేజ్ అలాంటిది. ఈ రెస్టారెంట్ న్యూజెర్సీలో ఉంది. ప్రెసిడెంట్ జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జూన్‌లో అమెరికాకు వెళ్లనున్నారు. జూన్ 22న అమెరికా అధ్యక్షుడు, ప్రథమ మహిళ కూడా మోదీకి స్టేట్ డిన్నర్ ఇవ్వనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అమెరికా పర్యటనపై భారతీయ ప్రవాసులు ఎంతో ఉత్కంఠగా ఉన్నారు. ప్రధాని మోదీ పర్యటనకు ముందు న్యూజెర్సీలోని ఓ రెస్టారెంట్.. ఆయన పేరిట ఫుడ్ ప్లేటర్‌ను ప్రారంభించిందంటే మోదీకి ఉన్న క్రేజ్ అలాంటిది. ఈ రెస్టారెంట్ న్యూజెర్సీలో ఉంది. ప్రెసిడెంట్ జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జూన్‌లో అమెరికాకు వెళ్లనున్నారు. జూన్ 22న అమెరికా అధ్యక్షుడు, ప్రథమ మహిళ కూడా మోదీకి స్టేట్ డిన్నర్ ఇవ్వనున్నారు. అనంత‌రం యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు. త‌ద్వారా రెండోసారి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా పీఎం నరేంద్ర మోదీ గుర్తింపు పొందనున్నారు.

పీఎం మోదీకి భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా భారీ అభిమానులు ఉన్నారు. ఆయ‌న‌ ఎక్కడికి వెళ్లినా భారతీయ ప్రవాసులు ప్రేమతో ముంచెత్తుత్తారు. త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఆయన పేరు మీద ‘మోదీ జీ థాలీ’ అనే థాలీని ప్రారంభించినట్లు రెస్టారెంట్ యజమాని శ్రీపాద్ కులకర్ణి ఒక వీడియోలో తెలిపారు. భారత-అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు ప్రధాని మోదీకి స్వాగతం పలకడానికి ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. భారతదేశం 10 ఏళ్లలో అంతా మారిపోయిందని.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు అని మ‌రో ప్ర‌వాస భార‌తీయుడు అన్నారు.

ప్రధాని మోదీ ప‌ర్య‌ట‌న ప‌ట్ల‌ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఉత్సాహంగా ఉందని అమెరికన్ ఓవర్సీస్ ఫ్రెండ్స్ బీజేపీ అధ్యక్షుడు అన్నారు. స్వాతంత్య్రానంతరం అమెరికా-భారత సంబంధాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు సిద్ధంగా ఉన్న ఈ మహత్తర సందర్భంగా ప‌ర్య‌ట‌న‌ జరుగుతున్నందుకు ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ గర్విస్తోందని అన్నారు. జూన్ 20 సాయంత్రం ప్రధాని మోదీ ఇక్కడికి వస్తున్నారని.. అయితే జూన్ 18న ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ 20 నగరాల్లో 'స్వాగత్ మోదీ యూనిటీ డే'ని నిర్వహిస్తోందని ఆయన చెప్పారు.

Updated On 12 Jun 2023 1:40 AM GMT
Ehatv

Ehatv

Next Story