క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 77.59 డాలర్లకు చేరుకుంది. ఇది గత కొన్ని నెలల్లో $90+ నుంచి బాగా దిగొచ్చింది.

క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 77.59 డాలర్లకు చేరుకుంది. ఇది గత కొన్ని నెలల్లో $90+ నుంచి బాగా దిగొచ్చింది. ఇది 3-4 ఏళ్ల కనిష్ఠ స్థాయి. కానీ, భారత్‌లో పెట్రోల్ ధరలో దాదాపు 50-60% సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, స్టేట్ VAT, ఇతర టాక్స్‌లు. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.94.77/లీటర్‌లో టాక్స్‌లు దాదాపు రూ.50పైనే ఉంటాయి. క్రూడ్ ధర తగ్గినా, ఈ టాక్స్‌ల వల్ల రిటైల్ ధరలో పెద్ద మార్పు కనిపించదు.ఏప్రిల్ 8, 2025 నుంచి కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని లీటర్‌కు రూ.2 పెంచింది. ఈ పెంచిన టాక్స్‌ను కన్స్యూమర్స్‌కు బదిలీ చేయకుండా, ఆయిల్ కంపెనీలు తమ మార్జిన్స్ నుంచి భరిస్తున్నాయని చెబుతున్నాయి. క్రూడ్ ధరలు 70-75 డాలర్‌ వద్ద స్థిరంగా ఉంటే, ఆయిల్ కంపెనీలు లీటర్‌కు రూ.2-4 తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఇది ప్రభుత్వం, ఆయిల్ కంపెనీల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. రూపాయి విలువ 83-84 వద్ద ఉంటే, క్రూడ్ ఆయిల్‌ (Crude Oil)ధర తగ్గినా పూర్తి లాభం చేకూరదు. క్రూడ్ ధరలు మరింత తగ్గి, $60-65 రేంజ్‌కు వస్తే, లేదా ప్రభుత్వం టాక్స్‌లు కొంచెం తగ్గిస్తే పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ.3-5 తగ్గే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పట్లో ఆశించడం కష్టం.క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, టాక్స్‌లు, ఆయిల్ కంపెనీల రికవరీ స్ట్రాటజీ, ఎక్సైజ్ డ్యూటీ పెంపు వల్ల పెట్రోల్ ధరలు ఇప్పట్లో గణనీయంగా తగ్గేలా కనిపించడం లేదు. రూ.2-3ఫెస్టివల్ సీజన్ లేదా ఎన్నికల సమయంలో వచ్చే అవకాశం ఉంది.

Updated On 12 April 2025 1:30 PM GMT
ehatv

ehatv

Next Story