ఆస్ట్రేలియా స్కిప్పర్‌ కమిన్స్‌ది(Pat cummins) ప్రేమ వివాహం. 2013లో బెకీ బోస్టన్‌తో(Becky boston) ఏర్పడిని పరిచయం కాస్త ప్రేమగా మారి 2020లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాక రెండేళ్ల గ్యాప్‌ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2021లోనే తాము బిడ్డను కనబోతున్నామని కమిన్స్‌-బెకీ జంట ప్రకటించింది.

ఆస్ట్రేలియా స్కిప్పర్‌ కమిన్స్‌ది(Pat cummins) ప్రేమ వివాహం. 2013లో బెకీ బోస్టన్‌తో(Becky boston) ఏర్పడిని పరిచయం కాస్త ప్రేమగా మారి 2020లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాక రెండేళ్ల గ్యాప్‌ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2021లోనే తాము బిడ్డను కనబోతున్నామని కమిన్స్‌-బెకీ జంట ప్రకటించింది. అయితే వాలైంటైన్స్‌ డే(Valentine's day) సందర్భంగా బెకీతో కలిసి ఉన్న ఫొటోను కమిన్స్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. 'గొప్ప తల్లి, భార్య, నా వాలైంటైన్‌ అని ఇన్‌స్టాగ్రాంలో రాసుకొచ్చాడు. సర్ఫింగ్‌ చేయడంలో తను దిట్ట అని పొగుడుతూ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు బెకీ అంటూ తన భార్యకు విషెస్‌ చేప్పాడు.

కమిన్స్‌ పోస్టుపై చాలా మంది నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ చేశారు. ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు ఈ జంటకు తెలిపారు. అయితే ఎప్పుడూ సోషల్‌ మీడియాలో పనిపాట లేని ఓ జులాయి బ్యాచ్‌ ఉంటుందిగా అందులో నుంచి ఒకడు బయల్దేరాడు. మీ భార్యను ప్రేమిస్తున్నా అని కమిన్స్‌ పోస్టు కింద కామెంట్‌ చేశడు: ' నేను భారతీయుడిని.. మీ భార్యను ప్రేమిస్తున్నా' అని వ్యాఖ్యానించాడు. అయితే ఇందు కమిన్స్‌ చాలా నీట్‌గా రిప్లై ఇచ్చాడు. కమిన్స్‌ స్పందిస్తూ ' అవునా.. సరే ఇదే విషాయ్నా నా భర్యకు తెలుపుతా' అని హుందాగా సమాధానం ఇచ్చాడు. దీంతో ఈ పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. కమిన్స్‌ హుందాతనాన్ని చూసి నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు. చాలా స్పోర్టివ్‌గా తీసుకున్నాడని ఈ స్పోర్ట్స్‌ మెన్‌ను పొగిడారు.
కాగా 2023లో కమిన్స్‌ సారథ్యంలో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23, వన్డే వరల్డ్‌కప్‌-2023 టైటిల్స్‌ గెలిచింది. ఇక ఈసారి కమిన్స్ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో ఆడనున్నాడు.

Updated On 14 Feb 2024 3:06 AM GMT
Ehatv

Ehatv

Next Story