Parrot Fever : యూరప్ దేశాల్లో విజృంభిస్తోన్న పారెట్ ఫీవర్.. అయిదుగురు మృతి
కొత్త కొత్త జబ్బులు పుట్టుకొస్తున్నాయి. మనుషులకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. ఐరోపా(Europe) దేశాలలో ఇప్పుడు పారెట్ ఫీవర్(Parrot Fever) స్వైర విహారం చేస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే అయిదుగురు చనిపోయారు. సిటాకోసిస్ అని పిల్చుకునే ఈ పారెట్ ఫీవర్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. యూరప్ దేశాల ప్రజలపై పారెట్ ఫీవర్ తీవ్ర ప్రభావం చూపుతున్నది.
కొత్త కొత్త జబ్బులు పుట్టుకొస్తున్నాయి. మనుషులకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. ఐరోపా(Europe) దేశాలలో ఇప్పుడు పారెట్ ఫీవర్(Parrot Fever) స్వైర విహారం చేస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే అయిదుగురు చనిపోయారు. సిటాకోసిస్ అని పిల్చుకునే ఈ పారెట్ ఫీవర్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. యూరప్ దేశాల ప్రజలపై పారెట్ ఫీవర్ తీవ్ర ప్రభావం చూపుతున్నది. 2023 సంవత్సరారంభంలో ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేసిన ఈ వ్యాధి ఇప్పుడు 2024 ఏడాది ఆరంభంలో అయిదుగురుని బలితీసుకుంది. గత ఏడాది ఆస్ట్రియాలో 14 పారెట్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. లేటెస్ట్‌గా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 27వ తేదీనాటికి డెన్మార్క్‌లో ఈ అంటువ్యాధికి సంబంధించిన 23 కేసులు వెలుగులోకి వచ్చాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. డెన్మార్క్‌లో ఒక వ్యక్తిలో ఈ వ్యాధి కనిపించింది. ఈ ఏడాది ఇప్పటికే జర్మనీలో అయిదు కేసులను నిర్ధారించారు వైద్యులు. పెంపుడు జంతువులు, అడవి పక్షులతో అనుబంధం ఉన్నవారే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెబుతోంది. పారెట్ ఫీవర్ అనేది క్లామిడియా ఇన్ఫెక్షన్ కారణంగా సోకుతుంది. ఇది వివిధ రకాల అడవి జంతువులు, పెంపుడు పక్షులు, కోళ్లలో కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పక్షులు అనారోగ్యంగా కనిపించకపోవచ్చు. కానీ అవి శ్వాస వదిలినప్పుడు, లేదా మలవిసర్జన చేసినప్పుడు బ్యాక్టీరియాను విడుదల చేస్తాయి. ఈ కారణంగానే వ్యాధి త్వరితగతిన వ్యాపిస్తోందని వైద్య నిపుణులు అంటున్నారు.