మరికొద్ది రోజుల్లో ఫ్రాన్స్‌(France) రాజధాని పారిస్‌లో(Paris) విశ్వ క్రీడలు(Olympics) జరగబోతున్నాయి

మరికొద్ది రోజుల్లో ఫ్రాన్స్‌(France) రాజధాని పారిస్‌లో(Paris) విశ్వ క్రీడలు(Olympics) జరగబోతున్నాయి. ఒలింపిక్స్‌ను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. నగరాన్ని సర్వాంగ సుందరంగా మారుస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్వహిస్తున్న ఒలింపిక్స్‌ను వీక్షించడానికి ప్రపంచం నలుమూలల నుంచి క్రీడాభిమానులు తరలివస్తారు. ఇప్పటికే పారిస్‌లోని హోటల్‌ గదులన్నీ బుక్కయ్యాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఒకే సమస్య ఫ్రాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తున్నది. అదేమిటంటే ఎలుకలు(Rats). పారిస్‌కు వచ్చే సందర్శకులకు ఎలుకలు కనిపించకుండా ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అక్కడ ఎలుకలు ఎక్కువే! ఎలుకలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఉచ్చులు వేసి వాటిని పట్టుకున్నామని పారిస్‌ డిప్యూటీ మేయర్‌ అన్న-క్లెరీ బౌక్స్‌ చెప్పారు. చాలా వరకు ఎలుకలను నియంత్రించగలిగామన్నారు. ఒలింపిక్స్‌ ప్రారంభమయ్యే నాటికి పారిస్‌లో ఎలుకలు లేకుండా చేస్తామని తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story