ప్రపంచం అంత కూడా ఎలక్ట్రిక్ వాహనాల (electric vehicles )ట్రెండ్ లో నడుస్తుంటే మాత్రం ఈ దేశం లో ఎలక్ట్రిక్ బైక్(elelctric bike ) పైన నిషేధాన్ని ప్రకటిస్తున్నారు . దీనితో అక్కడ ఈ-కంపెనీలు(e -company ) ప్రజలు వ్యతిరేకిస్తున్నారు . ఎందుకంటే

ప్రపంచం అంత కూడా ఎలక్ట్రిక్ వాహనాల (electric vehicles )ట్రెండ్ లో నడుస్తుంటే మాత్రం ఈ దేశం లో ఎలక్ట్రిక్ బైక్(elelctric bike ) పైన నిషేధాన్ని ప్రకటిస్తున్నారు . దీనితో అక్కడ ఈ-కంపెనీలు(e -company ) ప్రజలు వ్యతిరేకిస్తున్నారు . ఎందుకంటే ?

పారిస్(paris ) లో ఈ- బైక్ (e -bike )ను నిషేదిస్తున్నట్లు అక్కడ ప్రభుత్వం చెప్పడం జరిగింది రెండేళ్ల కాలంలో పారిస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాలకు ఈ-స్కూటర్లు కారణమని అధికారులు వెల్లడించారు . పారిస్‌ నగరంలో 2018లో తొలిసారి అద్దెకు ఈ-స్కూటర్లను (e-scooter)అందుబాటులోకి తీసుకువచ్చింది . స్మార్ట్‌ఫోన్ (smartphone)యాప్‌ ద్వారా బుక్‌ చేసుకుని నగరంలో ప్రయాణించవచ్చు. ఈ -బైక్ (e -bike )వేగం 20కి .మీ మించి ప్రయాణించకూడదు . ఎక్కువగా ఈ బైక్స్ ని రెంట్ కి తీసుకొని యువత ఆక్సిడెంట్స్ పా(accidents)లు అవుతున్న కారణంగా ఈ విధాన్నాన్ని అమలు చేయబోతున్నారు . గత రెండేళ్లుగా పారిస్ లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి . ఈ-స్కూటర్ల కారణంగా 2021లో జరిగిన ప్రమాదాల్లో 24 మంది చనిపోయారు .. 2022లోఅయితే రికార్డు స్థాయిలో 459 ప్రమాదాలు జరిగాయని పారిస్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.నిర్దిస్టమైన పార్కింగ్(parking) కూడా లేకపోవటం ,దాదాపుగా 20 నుండి 18ఏళ్ళ వయస్సు యువత అద్దె పేరుతో వీటిని విచ్చలవిడిగా డ్రైవ్ చేయడం పలు ప్రమాదాలకు కారణంగా గుర్తించినట్లు తెలపడం జరిగింది.

పార్కింగ్ కి సంబంధించి సరైన నియమాలు లేక రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ వెళ్లడం వలన ఈ-స్కూటర్లపై నిషేధం విధించారు. సెప్టెంబరు నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.దీనికోసం అక్కడ ప్రభుత్వం ప్రజల అభిప్రాయంగా ఓటింగ్ నిర్వహించింది. ఈ-స్కూటర్ల(e-scooter) కోసం నిర్వహించిన ఓటింగ్‌లో(voting) ఎక్కువ మంది ప్రజలు వాటికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో పారిస్‌(paris) నగరపాలక సంస్థ ఈ-స్కూటర్ల వినియోగంపై నిషేధం విధించాలని నిర్ణయించింది.సుమారు లక్షమంది పాల్గొన్నఈ ఓటింగ్ లో 89 శాతం మంది వాటిపై నిషేధించాలంటూ ఓటేశారని పారిస్‌ నగర మేయర్(mayor) తెలిపారు.

ప్రస్తుతం పారిస్‌లో 15,000 ఈ-స్కూటర్లు(e-scooter) ఉన్నాయి. లైమ్‌, డాట్‌, టైర్‌ అనే మూడు కంపెనీలు ఈ -బైక్స్ (e-bikes)ను ఉత్పత్తి చేస్తుండగా . తాజా నిర్ణయంతో సెప్టెంబరు నుంచి ఈ కంపెనీలు తమ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి .

Updated On 6 April 2023 2:08 AM GMT
Ehatv

Ehatv

Next Story