టర్కీలో ముగ్గురు పాకిస్థానీ శరణార్థులు ఒక భారతీయ పౌరుడిని కిడ్నాప్ చేసి

టర్కీలో ముగ్గురు పాకిస్థానీ శరణార్థులు ఒక భారతీయ పౌరుడిని కిడ్నాప్ చేసి, అతనిని విడుదల చేయడానికి భారతదేశంలోని అతని కుటుంబం నుండి రూ.20 లక్షలు డిమాండ్ చేశారు. మేలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కంబోడియాలో పాకిస్తానీయులు.. ఇద్దరు భారతీయులను మూడు వారాల పాటు బందీలుగా ఉంచారు, వారి కుటుంబాల నుండి డబ్బులను డిమాండ్ చేశారు. టర్కీ- కంబోడియాలో డబ్బుల కోసం కిడ్నాప్ చేసిన రెండు కేసులలో ప్రమేయం ఉన్న పాకిస్థానీలను పోలీసులు అరెస్టు చేశారు.

ఎడిర్నే నగరంలో భారతీయ పౌరుడిని కిడ్నాప్ చేశారనే ఆరోపణలపై ముగ్గురు పాకిస్థానీలను అరెస్టు చేసినట్లు టర్కీ పోలీసులు ఆదివారం తెలిపారు. ఇస్తాంబుల్‌లోని ఓ రెస్టారెంట్‌లో వంట మాస్టర్ అయిన రాధాకృష్ణన్‌ను పాకిస్థానీలు కిడ్నాప్ చేశారు. పాకిస్థానీలు రాధాకృష్ణన్‌ను జాబ్ ఆఫర్‌ ఆశ చూపి ఎడ్రిన్‌కు రప్పించి కిడ్నాప్ చేశారు. వారు అతని చేతులు, కాళ్ళు కట్టివేసి.. అతని కుటుంబానికి వీడియో పంపించారు. కిడ్నాపర్లు భారత్‌లో ఉన్న రాధాకృష్ణన్ కుటుంబం నుంచి రూ.20 లక్షల డబ్బులను డిమాండ్ చేశారు. పాకిస్థానీ కిడ్నాపర్ల నుంచి పిస్టల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కంబోడియాలో, ఇద్దరు భారతీయ పౌరులను కిడ్నాప్ చేసి మూడు వారాల పాటు నిర్బంధంలో ఉంచినందుకు ఇద్దరు పాకిస్థానీ వ్యక్తులను నమ్ పెన్‌ నగరంలో పోలీసులు అరెస్టు చేశారు.

Updated On 22 May 2024 9:31 AM GMT
Yagnik

Yagnik

Next Story