Pakistan Reporter Attack : లైవ్ రిపోర్టింగ్‌లో అనూహ్య ఘటన.. మహిళా రిపోర్టర్‌ను ఎత్తిపడేసిన ఎద్దు
Pakistan Reporter Attack : లైవ్ రిపోర్టింగ్‌లో అనూహ్య ఘటన.. మహిళా రిపోర్టర్‌ను ఎత్తిపడేసిన ఎద్దు
ఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టర్‌గా(Media Reporter) పనిచేయడం కష్టమే. పైగా లైవ్ రిపోర్టింగ్ చేయడం ఇంకా కష్టం. సబ్జెక్ట్ మీద కమాండ్‌తో పాటు స్పాంటేనిటీ చాలా అవసరం. అన్నీ ఉన్నా ఒక్కోసారి చిత్రమైన పరిస్థితులు ఎదువుతుంటాయి. ఇలాగే పాకిస్తాన్‌కు(Pakistan) చెందిన ఓ మహిళా రిపోర్టర్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. లైవ్ రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఎద్దు(Bull) ఆమెపై దాడి చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పశువుల సంత జరుగుతున్న చోటుకు వెళ్లి ఎద్దుల ధరలపై స్థానిక వ్యాపారులతో మాట్లాడుతూ లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నది. ఎద్దుల జోడికి అయిదు లక్షల రూపాయలు పలుకుతోందని, అంతకంటే తక్కువకు అమ్మడానికి వ్యాపారస్తులు సిద్ధంగాలేరని ఆమె చెబుతున్న సమయంలోనే హఠాత్తుగా ఓ ఎద్దు ఆమెపై దాడి చేసింది. దాంతో ఆ రిపోర్టర్ గట్టిగా కేకపెడుతూ ఎగిరి అవతల పడింది. ఆమె చేతిలో ఉన్న మైక్ కూడా ఎగిరి పడింది. ఈ దృశ్యం చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. లైవ్ రిపోర్టింగ్‌లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.