సోషల్‌ మీడియాతో(Social media) ప్రయోజనాలు ఉంటే ఉండవచ్చుగానీ, చాలా సార్లు చెడు జరుగుతోంది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే సంఘటనలు చాలా జరుగుతున్నాయి. మార్ఫింగ్‌తో అమ్మాయిలను వేధించే దగుల్బాజీలు కూడా ఎక్కువయ్యారు. ఇప్పుడు పాకిస్తాన్‌కు(Pakistan) చెందిన యూ ట్యూబర్‌(Youtubers) ప్రైవేటు వీడియో వైరల్‌ అవుతోంది. ఆమె పేరు అలీజా సహర్‌(Aliza Sahar). పాకిస్తాన్‌లోని ప్రముఖ యూ ట్యూబర్‌ ఆమె.

సోషల్‌ మీడియాతో(Social media) ప్రయోజనాలు ఉంటే ఉండవచ్చుగానీ, చాలా సార్లు చెడు జరుగుతోంది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే సంఘటనలు చాలా జరుగుతున్నాయి. మార్ఫింగ్‌తో అమ్మాయిలను వేధించే దగుల్బాజీలు కూడా ఎక్కువయ్యారు. ఇప్పుడు పాకిస్తాన్‌కు(Pakistan) చెందిన యూ ట్యూబర్‌(Youtubers) ప్రైవేటు వీడియో వైరల్‌ అవుతోంది. ఆమె పేరు అలీజా సహర్‌(Aliza Sahar). పాకిస్తాన్‌లోని ప్రముఖ యూ ట్యూబర్‌ ఆమె. తన ఛానెల్‌ ద్వారా పాకిస్తాన్‌ పల్లె జీవితాన్ని చూపించేవారు. ఇప్పుడు అలీజాకు సంబంధించిన ప్రైవేటు వీడియో(Private video) సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యింది.

ప్రస్తుతం ఆ వీడియో వేగంగా చక్కర్లు కొడుతోంది. అలీజా సహర్‌ ప్రతి రోజూ తన యూ ట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా పాకిస్తాన్‌ గ్రామీణ ప్రాంతాలను, అక్కడి జీవితాన్ని చూపించేవారు. ఈమె ఛానెల్‌ అనతికాలంలోనే ప్రజాదరణ పొందింది. యూ ట్యూబ్‌, టిక్‌టాక్‌ ద్వారా ఆమె సుమారు 15 లక్షలమంది సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్నారు. వారి కోసం పాకిస్తాన్‌ పల్లె ప్రజల జీవితం, అక్కడి వంటలు, సంస్కృతి సంప్రదాయాలు వంటి కంటెంట్‌ను చూపించేవారు. అలా సోషల్‌ మీడియాలో చాలా పాపులర్‌ అయ్యారు. ఇప్పుడామె పీకలలోతు వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ప్రైవేటు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఆ వీడియోలో అలీజా సహర్‌ ఓ వ్యక్తితో వీడియో కాల్‌లో(Video Call) మాట్లాడుతూ కనిపించారు. ఆ సమయంలో జరిగిన కొన్ని కార్యకలాపాలను కూడా వీడియోకాల్‌లో రికార్డు చేశారు. దానికి ఆ వ్యక్తి ఎడిట్‌ చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడని అలీజా చెబుతున్నారు. అలీజా సహర్‌ తన దుస్తులు తొలగించి శరీరాన్ని ప్రదర్శిస్తున్న దృశ్యాలతో పాటు కొంత అసభ్యకరమైన మాటలు కూడా ఉన్నాయని వీడియో చూసిన వారు చెబుతున్నారు. అయితే ఆ వీడియోలో ఉన్నది తాను కాదనీ, ఎవరో వీడియోను ఎడిట్‌ చేశారని అలీజా చెబుతున్నారు.

ఈ విషయంపై ఆమె పాకిస్తాన్‌ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కూడా వెళ్లారు. నెటిజన్లు మాత్ర ఆ వీడియోలో ఉన్నది అలీజా సహరేనని గట్టిగా చెబుతున్నరు. ఇదిలా ఉంటే అలీజా సహర్‌ చేసిన ఫిర్యాదును పాకిస్తాన్‌ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (AFIA) తీసుకుంది. తన ప్రైవేటు వీడియోను లీక్‌ చేసిన వ్యక్తిపై ఆమె చేసిన కంప్లయింట్‌తో రంగంలోకి దిగిన ఎఫ్‌ఐఏ ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి ఖతాలో ఉన్నాడని గుర్తించింది. ఈ విషయాన్ని అలీజా తన వీక్షకులకు తెలిపారు. సైబర్ క్రైమ్ టీమ్ కూడా తనకు సహాయం చేసేందుకు వచ్చిందని ఆమె పేర్కొన్నారు. కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన ఆన్‌లైన్ కమ్యూనిటీకి తన యూట్యూబ్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

Updated On 31 Oct 2023 12:45 AM GMT
Ehatv

Ehatv

Next Story