ఓ అణ్వస్త్ర దేశం అడుక్కోవాల్సి రావడం సిగ్గుచేటని పాకిస్తాన్‌ ప్రధానమంత్రి సెహబాజ్‌ షరీఫ్‌ తెగ ఫీలయ్యారు. దేశ దుస్థితిపై ఆవేదన చెందారు. రుణాల విషయంలో మిత్రదేశాలు కూడా తమను బిచ్చగాళ్లలా చూస్తున్నాయని బాధపడ్డారు.. అంతగా ఎందుకు బాధపడ్డారంటే ఆ దేశంలో అర్ధిక సంక్షోభం అంతలా ఉంది మరి! తినడానికి తిండి కూడా సరిగ్గా లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. ధరలేమో భయంకరంగా పెరిగిపోయాయి. మొన్నీమధ్యనే గోధుమపిండి కోసం జనం కొట్టేసుకున్నంత పని చేశారు. తొక్కిసలాటలో ఇద్దరు […]

ఓ అణ్వస్త్ర దేశం అడుక్కోవాల్సి రావడం సిగ్గుచేటని పాకిస్తాన్‌ ప్రధానమంత్రి సెహబాజ్‌ షరీఫ్‌ తెగ ఫీలయ్యారు. దేశ దుస్థితిపై ఆవేదన చెందారు. రుణాల విషయంలో మిత్రదేశాలు కూడా తమను బిచ్చగాళ్లలా చూస్తున్నాయని బాధపడ్డారు.. అంతగా ఎందుకు బాధపడ్డారంటే ఆ దేశంలో అర్ధిక సంక్షోభం అంతలా ఉంది మరి! తినడానికి తిండి కూడా సరిగ్గా లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. ధరలేమో భయంకరంగా పెరిగిపోయాయి. మొన్నీమధ్యనే గోధుమపిండి కోసం జనం కొట్టేసుకున్నంత పని చేశారు. తొక్కిసలాటలో ఇద్దరు ముగ్గురు చనిపోయారన్న వార్తలు కూడా వచ్చాయి. పాక్‌ దయనీయ పరిస్థితిని చాటి చెప్పే వీడియో ఒకటి సోషల్‌ మీడియాలలో చక్కర్లు కొడుతోంది.. ఇందులో గోధుమపిండి లోడుతో వెళుతున్న ఓ ట్రక్కు వెనకాల జనం పరుగులుపెడుతున్నారు. టూ వీలర్ల మీదనే అనుకోండి.. తమకో పిండి బస్తా ఇవ్వమని చేతిలో డబ్బులు పట్టుకుని మరీ బతిమాలుకుంటున్నారు. అన్నట్టు ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసిందెవరనుకున్నారు? నేషనల్‌ ఈక్వాలిటీ పార్టీ జమ్ముకశ్మీర్‌ గిల్గిత్‌ బాల్టిస్తాన్‌ అండ్‌ లద్దాఖ్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ సజ్జాద్‌ రాజా.. ఈ వీడియోను చూసైనా జమ్ముకశ్మీర్‌ ప్రజలు కళ్లు తెరవండంటూ కాప్షన్‌ పెట్టారు. పాకిస్తాన్‌లో లేనందుకు అదృష్టవంతులు అంటూ కామెంట్‌ చేశారు.

Updated On 6 April 2023 2:08 AM GMT
Ehatv

Ehatv

Next Story