పాకిస్తాన్‌(Pakistan) ఆక్రమిత కశ్మీర్‌ తనంతటా తానుగానే భారతదేశంలో కలిసిపోతుందని, అందుకు కొంత కాలం వేచి ఉండాలని మొన్నామధ్య కేంద్రమంత్రి వీకే సింగ్‌(V K Singh) అన్నారు కదా! ఆ కొంత కాలం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది పీవోకే పరిస్థితులు చూస్తుంటే! పీఓకేలో ఉన్న జనమంతా పాకిస్తాన్‌పై మండిపడుతున్నారు.

పాకిస్తాన్‌(Pakistan) ఆక్రమిత కశ్మీర్‌ తనంతటా తానుగానే భారతదేశంలో కలిసిపోతుందని, అందుకు కొంత కాలం వేచి ఉండాలని మొన్నామధ్య కేంద్రమంత్రి వీకే సింగ్‌(V K Singh) అన్నారు కదా! ఆ కొంత కాలం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది పీవోకే పరిస్థితులు చూస్తుంటే! పీఓకేలో ఉన్న జనమంతా పాకిస్తాన్‌పై మండిపడుతున్నారు. దశాబ్దాలుగా పాకిస్తాన్‌ తమపై సవతితల్లి ప్రేమ చూపిస్తోన్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు కరెంటు బిల్లుల మదింపులో కూడా భరించలేనంత వివక్ష ఉన్నదంటూ వాపోతున్నారు. తమ ప్రాంతం నుంచే ఏకంగా అయిదువేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతోందని, దాన్నంతటినీ తరలించుకుపోయి దేశమంతటికీ వాడుకుంటున్నారని చెబుతున్నారు. కరెంట్ బిల్లుల విషయానికి వచ్చేసరికి ప్రధాన భూభాగంలో ఉన్నవారికి తక్కువగా వసూలు చేస్తూ, తమకేమో భరించలేనంత ఎక్కువగా వేస్తున్నారని ఆక్రోశిస్తున్నారు. తమ పట్ల ఇది సహించరాని అన్యాయమంటూ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. మొదట్లో తమ కోపాన్ని పెద్దగా ప్రదర్శించేవారు కాదు కానీ, ఇప్పుడు ఆ కోపం కాస్తా తీవ్రమైన ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకుంటోంది. భారీ కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క కోట్లి జిల్లాలోనే కేవలం ఒకేఒక్క నెలలో 139 కోట్ల రూపాయల బిల్లులు వచ్చాయని స్థానిక నేత తౌకీర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.ఇందులో కేవలం 19 కోట్ల రూపాయల బిల్లులు కట్టారని, వచ్చే నెల నుంచి అవి కూడా కట్టేది లేదని కరాఖండిగా చెప్పారాయన! దశాబ్దాలుగా ప్రభుత్వం తమను ద్వితీయశ్రేణి పౌరులుగా భావిస్తూ అన్యాయం చేస్తున్నదని తౌకీర్‌ అంటున్నారు.

Updated On 18 Sep 2023 5:31 AM GMT
Ehatv

Ehatv

Next Story