అండర్‌ వరల్డ్‌(Underworld) డాన్‌, మోస్ట్‌ వాంటెండ్‌ క్రిమినల్‌(Most Wanted Criminal) దావూద్‌ ఇబ్రహీంను(Dawood Ibrahim) హాస్పిటల్‌లో జాయిన్‌ చేశారు. అతడి ఆరోగ్య విషమంగా ఉందట! తీవ్ర అనారోగ్యంతో ఉన్న దావూద్‌ ఇబ్రహీంను సోమవారం కరాచీలోని(Karachi) ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అతడిపై విష ప్రయోగం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు.

అండర్‌ వరల్డ్‌(Underworld) డాన్‌, మోస్ట్‌ వాంటెండ్‌ క్రిమినల్‌(Most Wanted Criminal) దావూద్‌ ఇబ్రహీంను(Dawood Ibrahim) హాస్పిటల్‌లో జాయిన్‌ చేశారు. అతడి ఆరోగ్య విషమంగా ఉందట! తీవ్ర అనారోగ్యంతో ఉన్న దావూద్‌ ఇబ్రహీంను సోమవారం కరాచీలోని(Karachi) ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అతడిపై విష ప్రయోగం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. మరో రెండు రోజుల పాటు అతడు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటాడని పాకిస్తాన్‌(Pakistan) మీడియా తెలిపింది. ఆసుపత్రి లోపల దావూద్‌ ఇబ్రహీం కట్టుదట్టమైన భద్రత మధ్య చికిత్స తీసుకుంటున్నాడు. ఆసుపత్రిలోని ఒక ఫ్లోర్‌ మొత్తం దావూద్‌ ఒక్కటే పేషంట్‌గా ఉన్నాడట! అతడిని చూడటానికి కుటుంబసభ్యులు, ఆసుపత్రి ఉన్నతాధికారులకు మాత్రమే అనుమతి ఉన్నదని పాక్‌ మీడియా పేర్కొంది. ఈ మాఫియా డాన్‌ గురించి ఈ ఏడాది జనవరిలో అతడి సోదరి ఓ ఆసక్తికరమైన విషయం తెలిపింది. రెండో వివాహం చేసుకున్నప్పటి నుంచి దావూద్‌ కరాచీలోనే ఉంటునట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణలో ఆమె తెలిపింది. మరోవైపు దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులుపాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించినట్లు ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో ఆమె వివరించింది.

Updated On 18 Dec 2023 1:15 AM GMT
Ehatv

Ehatv

Next Story