Lock Down In Pakistan : పాకిస్తాన్‌లోని రెండు నగరాలలో పూర్తి లాక్‌డౌన్...ఎందుకంటే?
వాయు కాలుష్యం(Air Pollution) మన ఢిల్లీ(Delhi) నగరంలోనే కాదు, పొరుగునే ఉన్న పాకిస్తాన్‌లోని(Pakistan) నగరాలను కూడా వణికిస్తోంది.
వాయు కాలుష్యం(Air Pollution) మన ఢిల్లీ(Delhi) నగరంలోనే కాదు, పొరుగునే ఉన్న పాకిస్తాన్‌లోని(Pakistan) నగరాలను కూడా వణికిస్తోంది. వాయు కాలుష్యం కారణంగా జనం అనేక అవస్థలు పడుతున్నారు. దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్‌లోని పంజాబ్(Punjab) ప్రావిన్స్‌లో ఉన్న లాహోర్(Lahore), ముల్తాన్(Multhan) నగరాలలో పూర్తి లాక్‌డౌన్ విధించారు. ముల్తాన్ నగరంలో AQI 2000 దాటింది. లాహోర్‌లో AQI 1100 కంటే ఎక్కువగానే కొనసాగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పంజాబ్ ప్రభుత్వం లాహోర్, ముల్తాన్‌లలో పూర్తి లాక్‌డౌన్(Lock down) విధించింది. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాలలో లాహోర్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. కాలుష్యం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు(Health problems) తలెత్తుతున్నాయి. ప్రజలు శ్వాస కోశ వ్యాధులతో(breathing issues) బాధపడుతున్నారు. కోవిడ్ కంటే డేంజర్‌గా తయారయ్యింది. పంజాబ్ ప్రావిన్స్ అంతటా స్కూల్స్ బందు అయ్యాయి. ఒక్క వారం రోజుల్లోనే సుమారు ఆరు లక్షల మంది కాలుష్య సంబంధిత వ్యాధులకు గురయ్యారు. సుమారు 70 వేల మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పారామెడికల్ సిబ్బంది సెలవులను రద్దు చేసింది.