పాకిస్తాన్‌లో(Pakistan) నిత్యావసరవస్తువుల ధరలే కాదు, పెట్రో ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి.

పాకిస్తాన్‌లో(Pakistan) నిత్యావసరవస్తువుల ధరలే కాదు, పెట్రో ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. లేటెస్ట్‌గా షహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం మరోసారి పెట్రోల్‌(Petrol), డీజిల్‌ ధరలను పెంచింది. పాకిస్తాన్‌ ఆర్థిక మంత్రిత్వ శాఖ పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తక్షణమే పెంచుతున్నట్టు ప్రకటిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి పెచిన ధరలు అమలులోకి వచ్చాయి. రాబోయే పదిహేను రోజుల పాటు ఇవే ధరలు కొనసాగుతున్నాయని పాక్‌ ప్రభుత్వం తెలిపింది. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలలో చోటు చేసుకున్న హెచ్చుతగ్గుల కారణంగా ధరలను పెంచాల్సి వచ్చిందని పాక్‌ ప్రభుత్వం పేర్కొంది. తాజాగా పాకిస్తాన్‌లో పెట్రోల్‌ ధర లీటరుకు 7.45 రూపాయల చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం లీటరు పెట్రోల్‌ ధర 258.16 రూపాయల నుంచి 265.61 రూపాయలకు చేరింది. మన కరెన్సీలో చెప్పాలంటే 79.92 రూపాయలు. ఇక డీజిల్‌ విషయానికొస్తే 9.60 రూపాయలు పెరిగింది. దీంతో దేశంలో లీటరు డిజిల్‌ ధర 267.89 రూపాయల నుంచి 277.49 రూపాయలకు చేరింది. ఇండియన్‌ కరెన్సీలో 83.49 రూపాయలు. ఈ లెక్కన పెట్రోలు ధరలు మనకంటే పాకిస్తాన్‌లోనే చవక!

Eha Tv

Eha Tv

Next Story