పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్‌ను(Pakistan) పులి మీద పుట్రలా ఇప్పుడు నల్లధనం(Black Money) సమస్య పట్టి పీడిస్తోంది. బ్లాక్‌ మనీ విపరీతంగా పెరిగిపోవడంతో దాన్ని ఎలా అరికట్టాలో తెలియక సతమతమవుతోంది దాయాది దేశం. పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. అవినీతి సొమ్ము బడా బాబుల దగ్గర కుప్పలు తెప్పలుగా ఉంది.

పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్‌ను(Pakistan) పులి మీద పుట్రలా ఇప్పుడు నల్లధనం(Black Money) సమస్య పట్టి పీడిస్తోంది. బ్లాక్‌ మనీ విపరీతంగా పెరిగిపోవడంతో దాన్ని ఎలా అరికట్టాలో తెలియక సతమతమవుతోంది దాయాది దేశం. పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. అవినీతి సొమ్ము బడా బాబుల దగ్గర కుప్పలు తెప్పలుగా ఉంది. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, ఆర్మీ జనరల్స్‌, పోలీసు అధికారులు వీరంతా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారు. కూడబెట్టడం కాదు కొల్లగొట్టారు. పాకస్తాన్‌ ప్రభుత్వం దాడులైతే చేస్తున్నది కాని అక్రమ సొమ్మును పట్టుకోలేకపోతున్నది. కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి పాక్‌ ప్రభుత్వం వెనుకాడుతోంది. అందుకు కారణం ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉండటం. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో నల్లధనంపై ఏ పార్టీ నేతలు కూడా మాట్లాడేందుకు సిద్ధంగా లేరు.

ఇదిలా ఉంటే పాకిస్తాన్‌లో బ్లాక్‌ మనీని(Black money) అరికట్టేందుకు భారత్‌ మాదిరిగా పెద్ద నోట్లను రద్దు చేయాలని అక్కడి ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా భారత్‌ మొదట్లో కొంత ఇబ్బంది పడింది. తర్వాతి కాలంలో ఆర్ధిక వృద్ధిని ప్రోత్సహించింది. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లను నియంత్రణలో ఉంచగలిగిందని నిపుణులు అంటుననారు. పేరుకుపోయిన నల్లధనాన్ని వెలికి తీయడానికి పాకిస్తాన్‌లో ఉన్న అతి పెద్ద నోటు అయిదు వేల రూపాయల కరెన్సీని దశలవారీగా రద్దు చేయాలని ఆర్ధిక నిపుణులు కోరుతున్నారు కానీ పాక్‌ అధికారులు మాత్రం దీనిపై నిర్లిప్తంగా ఉంటున్నారు.

దక్షిణాసియా దేశాలలో 5000 రూపాయల నోటు కేవలం పాకిస్తాన్‌లో మాత్రమే ఉంది. ఇంత భారీ విలువ కలిగిన కరెన్సీ నోటు మరే ఆసియా దేశాలోల లేదు. నగదు నిల్వలకు ఇంత భారీ విలువ కలిగిన నోటే కారణమని పలు నివేదికలు చెప్పాయి. పాకిస్తాన్‌లో బ్లాక్‌ మనీతో ఏర్పడిన ఆర్ధిక వ్యవస్థ 341.5 బిలియన్‌ డాలర్లుగా ఉందని అంచనా. ఇక పాకిస్తాన్‌లోని షాడో ఆర్థిక వ్యవస్థ అక్కడి జీడీపీలో 40 శాతం వరకు ఉంది. పాకిస్తాన్ జీడీపీలో ప్రతి ఏడాది ఆరు శాతం మాయమవుతున్నది. అంటే పెద్దమొత్తంలో నగదు లెక్కలకు అందకుండా పోతున్నది. ఆర్థిక సంక్షోభం దిశగా పాకిస్తాన్ వెళ్లడానికి ఇదే కారణం:

Updated On 8 Aug 2023 4:37 AM GMT
Ehatv

Ehatv

Next Story