పాకిస్తాన్(Pakisthan) మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు(Imran khan) పదేళ్ల జైలు శిక్ష పడింది. ప్రభుత్వ రహస్యాలను బహిరంగపరుస్తున్నారన్న కేసు (సైఫర్)లో కోర్టు ఇమ్రాన్‌కు ఈ శిక్షను విధించింది. పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్, వైస్ ఛైర్మన్ షా మహమూద్ ఖురేషీలకు శిక్ష విధిస్తూ పాకిస్థాన్‌లోని ప్రత్యేక కోర్టు ఈ తీర్పును వెలువరించింది. సైఫర్ కేసు ప్రత్యేకించి దౌత్యపరమైన సమాచారానికి సంబంధించింది.
పాకిస్తాన్(Pakisthan) మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు(Imran khan) పదేళ్ల జైలు శిక్ష పడింది. ప్రభుత్వ రహస్యాలను బహిరంగపరుస్తున్నారన్న కేసు (సైఫర్)లో కోర్టు ఇమ్రాన్‌కు ఈ శిక్షను విధించింది. పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్, వైస్ ఛైర్మన్ షా మహమూద్ ఖురేషీలకు శిక్ష విధిస్తూ పాకిస్థాన్‌లోని ప్రత్యేక కోర్టు ఈ తీర్పును వెలువరించింది. సైఫర్ కేసు ప్రత్యేకించి దౌత్యపరమైన సమాచారానికి సంబంధించింది. గత ఏడాది మార్చిలో అమెరికా వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయం పంపిన రహస్య దౌత్య కేబుల్ (సైఫర్)ను లీక్ చేశారని ఇమ్రాన్ ఖాన్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఇమ్రాన్‌ఖాన్‌పై కేసు నమోదయ్యింది. ఈ సైఫర్ కేసులో తనను ప్రధానమంత్రి పదవి నుంచి తప్పించడానికి కుట్ర జరుగుతోందని ఆనాడే ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. 2022, ఏప్రిల్ మాసంలో అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్‌ఖాన్ ఓడిపోయారు. ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలిగారు. తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ కోర్టు ఇమ్రాన్‌కు మూడు ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆగస్టు 5, 2023న ఇమ్రాన్ జైలు పాలయ్యారు. పోలీసులు ఆయన్ని అటాక్ జైలులో ఉంచారు. అయితే.. ఇస్లామాబాద్ హైకోర్టు ఈ శిక్షను రద్దు చేసింది. కానీ ఇతర కేసులలో ఇమ్రాన్‌ను నిర్బంధంలో ఉంచారు.