పాకిస్తాన్‌(Pakistan) మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌(Imran khan) తన దేశ ఆర్మీ చీఫ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. గృహ నిర్బంధంలో ఉన్న తన భార్య బుష్రా బీబీపై(Bushra Bibi) విషప్రయోగం(poisoning) జరిగిందని ఇమ్రాన్‌ ఆరోపించారు. తన భార్యకు ఎలాంటి హాని జరిగినా అందుకు ఆర్మీ చీఫ్‌దే బాధ్యత అని చెప్పారు. 190 మిలియన్‌ పౌండ్ల తోషాఖానా అవినీత కేసు విచారణకు హాజరైన పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ అధినేత ఇమ్రాన్‌ ఈ విషయాన్ని తెలిపారు.

పాకిస్తాన్‌(Pakistan) మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌(Imran khan) తన దేశ ఆర్మీ చీఫ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. గృహ నిర్బంధంలో ఉన్న తన భార్య బుష్రా బీబీపై(Bushra Bibi) విషప్రయోగం(poisoning) జరిగిందని ఇమ్రాన్‌ ఆరోపించారు. తన భార్యకు ఎలాంటి హాని జరిగినా అందుకు ఆర్మీ చీఫ్‌దే బాధ్యత అని చెప్పారు. 190 మిలియన్‌ పౌండ్ల తోషాఖానా అవినీత కేసు విచారణకు హాజరైన పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ అధినేత ఇమ్రాన్‌ ఈ విషయాన్ని తెలిపారు. తన భార్య బుష్రాకు విషమిచ్చి చంపే ప్రయత్నం జరిగిందని న్యాయమూర్తి నాసిర్ జావేద్ రాణాకు విన్నవించుకున్నారు. తన భార్య బుష్రాకు ఏదైనా ముప్పు వాటిల్లితే అందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్(Asim Munir) బాధ్యత వహించాల్సి ఉంటుదని ఇమ్రాన్‌ వ్యాఖ్యానించారు. షౌకత్ ఖానుమ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అసిమ్ సాయంతో తన భార్యకు వైద్య పరీక్షలు చేయించాలని ఇమ్రాన్ ఖాన్ న్యాయస్థానాన్ని కోరారు. ఇంతకుముందు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్‌పై తనకు, తన పార్టీకి నమ్మకం లేదని ఇమ్రాన్‌ చెప్పారు.
ఇదిలా ఉంటే ఇమ్రాన్‌ఖాన్‌ విజ్ఞప్తి మేరకు ఆయన భార్య బుష్రా వైద్య పరీక్షలకు సంబంధించి దరఖాస్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. విచారణ తర్వాత మీడియాతో ముచ్చటించిన మాట్లాడిన బుష్రా తాను అమెరికన్ ఏజెంట్ అంటూ పార్టీలో వదంతులు వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. తన ఆహారంలో టాయిలెట్ క్లీనర్ చుక్కలు కలిశాయని ఆమె ఆరోపించారు. ఫలితంగా తన కళ్లు వాచిపోయాయని, ఛాతీ, కడుపులో నొప్పితో ఇబ్బంది పడుతున్నానని బుష్రా ఆవేదనగా చెప్పారు.

Updated On 3 April 2024 1:46 AM GMT
Ehatv

Ehatv

Next Story